బేబీ బ్యూటీకి బంపర్ రెమ్యునరేషన్

యూట్యూబ్ షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్ లలో నటిస్తున్న వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో సూపర్ హిట్ కొట్టేసింది. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిన్న చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దాదాపు 95 నుంచి రూ.92 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. బేబీ సినిమాలో తన పాత్రకు చైతన్య వందశాతం న్యాయం చేసిందని విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. మొదటి సినిమాలోనే ఎంతో డెప్త్ ఉన్న పాత్రలో నటించి అందరినీ మెప్పించింది.

బేబీ క్రేజ్ తోనే వరుసగా అవకాశాలను అందుకుంటోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో కూడా వైష్ణవి ఒక సినిమా చేయబోతోంది. కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతోంది. హీరోగా ఆశిష్ నటిస్తున్నాడు. దిల్ రాజు సోదరుడి కొడుకైన ఆశిష్ కు ఇది మూడో సినిమా అవుతుంది. ఈ సినిమాలో నటించేందుకు వైష్ణవి చైతన్యకు దాదాపు కోటిరూపాయల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

baby beauty vaishnavi chaitanya remuneration

తెలుగు అమ్మాయి హీరోయిన్ గారాణించడమే అరుదు అనుకుంటే అందులోను తోటి హీరోయిన్లలా కోట్లరూపాయల పారితోషికం తీసుకోవడం గొప్ప విషయం అంటున్నారు. బేబీ క్రేజ్ తోనే ఆమెకు ఐదు సినిమాల ఆఫర్లు వచ్చాయి. కెరీర్ లో మొదటి హిట్ తర్వాత అవకాశాలు రావడం కామేకానీ వాటిని నిలబెట్టుకోవడంలోనే గొప్పతనం ఇమిడివుంటుంది. అందుకే వైష్ణవి సినిమాలను ఎంపిక చేసుకునే విషయంలో ఆచితూచి అడుగులు వస్తోంది. ఆశిష్ తోపాటు ఆనంద్ దేవరకొండతో మరో సినిమా చేస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ సరసన కూడా ఒక సినిమాలో నటించబోతోందని వార్తలు వచ్చాయికానీ దీనిపై అధికారికంగా ధ్రువీకరణ లేదు. ఏదేమైనప్పటికీ ఒక తెలుగమ్మాయి స్టార్ హీరోయిన్ గా మారడంపై తెలుగు పరిశ్రమ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+