కీర్తి సురేష్‌కు పెళ్లి కలిసి రాలేదు..!
హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా 'మహానటి' సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు.
ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగేస్తున్నారు.ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. నేటితరంలో పద్దతిగా కనిపిస్తే అవకాశాలు రావని గ్రహించిన కీర్తి సురేష్, ఈ రూల్స్‌ను బ్రేక్ చేస్తోంది. కీర్తి సురేష్ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ ఇస్తోంది. కీర్తి సురేష్ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. క్రిస్మస్ కానుకుగా ఈ సినిమా డిసెంబర్ 25న విడుదలైంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిర తేరీ సినిమాకు ఈ సినిమా రీమేక్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. వరుణ్ ధావన్ నటనకు మంచి మార్కులే వేసినా కానీ, క్రిటిక్స్ కీర్తి పాత్రలో మ్యాటర్ లేని తేల్చేసారు. పైగా కీర్తి పాత్ర ఇందులో చనిపోతుంది. గ్లామర్ డోస్ పరంగాను కీర్తి నార్త్ ఆడియెన్ రేంజుకు మ్యాచ్ చేయలేకపోయిందని విమర్శించారు.కీర్తి ఒక బ్యాడ్ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. దీంతో కీర్తి సురేష్ పెళ్లి తర్వాత నటించిన తొలి సినిమా ప్లాప్‌గా నిలిచింది.కనీసం తదుపరి ప్రయత్నం అయినా సఫలమవుతుందేమో చూడాలంటూ నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications