స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసిన 'బేబీ హీరోయిన్..?

చిన్న సినిమాగా వచ్చిన 'బేబీ' పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ఎంతటి సంచలనం విజయం సృష్టించిందో అందరికి తెలిసిందే. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ,వైష్ణవి హీరో, హీరోయిన్లుగా నటించారు.ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. వాస్తవరూపానికి దగ్గరగా ఉండటంతో 'బేబీ'కి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.

ముఖ్యంగా సినిమాలో వైష్ణవి నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఓ యూట్యూబర్ నుంచి ఇలా నటనను ఎవరూ ఊహించలేదు అయితే ఈ సినిమా తరువాత వైష్ణవికి వరుస ఆఫర్లు వస్తాయని అందరూ భావించారు.కానీ అలా జరగలేదు. అనుకున్నంత స్థాయిలో వైష్ణవికి అవకాశాలు రావడం లేదు. 'బేబీ' దర్శకుడే తిరిగి వైష్ణవికి తన కొత్త సినిమాలో ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Baby movie heroine Vaishnavi Chaitanya Special song from star hero movie

ఇదిలా ఉంటే వైష్ణవికి ఓ సినిమాలో ఐటం సాంగ్ చేసే అవకాశం దక్కింది. రామ్ పోతినేని-డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో వైష్ణవి ఓ ఐటం సాంగ్ చేయబోతుందట. మొదట్లో ఈ సినిమాలో వైష్ణవిని సెకండ్ హీరోయిన్‌గా తీసుకుందమని భావించారట. కాని ఏమైందో తెలియదు కాని..ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకున్నారు.

ఎలాగైనా 'డబుల్ ఇస్మార్ట్' లో వైష్ణవి ఉండాలని భావించిన దర్శకడు పూరి ఆమెతో ఓ ఐటం సాంగ్ ప్లాన్ చేశాడట.అటు వైష్షవి సైతం ఐటం సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పూరి సినిమాల్లో ఐటం సాంగ్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. దీంతో రామ్ పోతినేనితో వైష్ణవి మాస్ స్టెప్పులు వేయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+