దూసుకుపోతున్న చిన్న సినిమా.. థియేటర్స్ పెంపు !!
రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ముఖ్య తారాగణంగా నటించిన చిత్రం "బ్యాడ్ గాళ్స్". కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్ లైన్. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి ఈ సినిమాకి దర్శకత్ వహించారు. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ఈ మూవీ.. అమ్మాయిల ట్రిప్, క్రైమ్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ ఇలా అన్నీ మిక్స్ చేసి రూపొందించారు.ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ మూవీ మంచి టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్న తరుణంలో చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి (మున్నా) మాట్లాడుతూ .. సినిమా నిడివి విషయంలో చిన్నది కానీ.. కంటెంట్ విషయంలో మాత్రం చాలా పెద్దది అని అన్నారు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం ప్రధాన బలం అని వ్యాఖ్యానించారు. కరోనాలో రిలీజ్ చేసిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' చిత్రం పెద్ద హిట్ అయిందని.. ఇప్పుడు ఈ మూవీని కూడా ఆడియెన్స్ హిట్ చేశారని తెలిపారు.

నిర్మాత శశిధర్ నల్ల మాట్లాడుతూ .. బ్యాడ్ గాళ్స్ సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ప్రతీ యాక్టర్ మాకు ఎంతో అండగా నిలబడ్డారు. థియేటర్ల నుంచి నాకు ఫోన్స్ వస్తున్నాయి. ఇంకా షోలు, స్క్రీన్‌లు పెంచమని అడుగుతున్నారు. ప్రస్తుతం ఉన్న కాంపీటిషన్‌లో మా చిన్న సినిమాని అద్భుతమైన సినిమాగా మార్చారు. రోషన్ సూర్య మాట్లాడుతూ .. బ్యాడ్ గాళ్స్ నా సినీ ప్రయాణానికి నాందిలా అనిపిస్తోంది. దర్శకుడు కథను అద్భుతంగా నెరేట్ చేశారు. అప్పుడే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇది నాకు ఆరంభం మాత్రమే. ఈ చిత్రానికి మంచి స్పందన వస్తుండటం ఆనందంగా ఉంది. మా టీంను ఇలానే ఆదరించండి అని అన్నారు.
పాయల్ చెంగప్ప మాట్లాడుతూ .. తనకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఫస్ట్ హాఫ్ యూత్ కంటెంట్‌లా ఉంటుంది. సెకండాఫ్ అంతా కూడా ఎమోషనల్‌గా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. మా మూవీని చూసిన వారంతా కూడా కన్నీరు పెట్టేస్తున్నారు. అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది. ఇది నాకు తొలి చిత్రం. మా సినిమాని అందరూ సపోర్ట్ చేయండి' అని అన్నారు. అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ .. నీలి నీలి ఆకాశం పాట ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. చూసిన ప్రతీ ఒక్కరూ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారని చెప్పుకొచ్చారు.













Click it and Unblock the Notifications