పవన్ గెలుపు తర్వాత అల్లు అర్జున్‌కు అన్నీ అపశకునాలే!

సినిమాల్లో పవర్ స్టార్ కాస్తా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాజకీయాల్లో కూడా 'పవర్'స్టార్ అయ్యారు పవన్ కల్యాణ్. తనతోసహా జనసేన పార్టీ తరఫున పోటీచేసిన 21 మందిని గెలిపించుకొని సంచలన రికార్డు సృష్టించారు. సినిమాల్లోనేకాదు.. రాజకీయాల్లో కూడా తమ హీరో రికార్డులు సృష్టిస్తాడనేది దీంతో రుజువైందని పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక, పంచాయితీరాజ్ శాఖలకు మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

ఎన్నికలకు ముందు పెద్ద దుమారం
పవన్ ప్రమాణ స్వీకారానికి చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబు తోపాటు కుటుంబ సభ్యులు పలువురు హాజరయ్యారు. మెగా కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. అందరూ పవన్ గెలుపును ఆస్వాదించారు. అయితే మరోవైపు అల్లు అర్జున్ కు మాత్రం అన్నీ అపశకునాలే ఎదురవుతున్నాయి. ఎన్నికల సమయంలో తన తండ్రి అరవింద్ తో సహా మెగా కుటుంబ సభ్యులంతా పిఠాపురం వెళ్లి పవన్ కు మద్దతుగా ప్రచారం చేశారు. అల్లు అర్జున్ మాత్రం ట్వీట్ తో సరిపెట్టారు. ఆ తర్వాతరోజు సతీమణితో సహా నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకు మద్దతు ప్రకటించారు. దీనిపై పెద్ద దుమారం రేగింది.

bad news for allu arjun atlee film dropped and pushpa 2 postponed december

'చెప్పను బ్రదర్' అన్నాడు
పవన్ విజయం సాధించిన తర్వాత కూడా బన్నీ ట్వీట్ తో సరిపెట్టారు. గతంలో ఓ సినిమా వేడుకకు హాజరైనప్పుడు పవన్ కల్యాణ్ గురించి మాట్లాడాలంటూ అభిమానులు అల్లు అర్జున్ పై ఒత్తిడి తెచ్చారు. అయితే 'చెప్పను బ్రదర్' అంటూ వ్యాఖ్యానించడంతో 'నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'సినిమాను మెగా అభిమానులు ఫ్లాప్ చేశారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లకపోవడంతో బన్నీపై పవన్ అభిమానులు, మెగా అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పుష్ప2 సినిమా డిసెంబరు 6కు వాయిదా పడింది.

మెగా కుటుంబంతో పెట్టుకుంటే అంతే..
పవన్ అభిమానులతో విభేదాలు నడుస్తున్న తరుణంలో సినిమా విడుదలైనా కచ్చితంగా ఫ్లాప్ చేస్తారని నిర్మాతలు భావించారు. అందుకే డిసెంబరు ఆరోతేదీకి వాయిదా వేసుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు రూ.400 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఈ సమయంలో అంత రావని వారు అంచనా వేసుకున్నారు. దీంతో సినిమాను వాయిదా వేయక తప్పలేదు. షూటింగ్ అవలేదు.. వీఎఫ్ఎక్స్ పని పూర్తికాలేదు.. సుకుమార్ రాజీపడటంలేదు.. అనేవన్నీ సుత్తిమాటలే. అసలు విషయం ఇదే. అంతేకాకుండా అల్లు అర్జున్ పుష్ప2 తర్వాత అట్లీతో చేయాల్సిన సినిమా కూడా రద్దయింది. అట్లీ రూ.80 కోట్ల పారితోషికం అడగడంతో నిర్మాతలను ప్రాజెక్టును రద్దుచేసుకున్నారు. మెగా కుటుంబంతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందంటూ పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+