ఎన్టీఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమా మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న 'దేవర' సినిమాలోని మొదటి పార్ట్‌ను సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇటీవలే ఈ సినిమాకు సంబంధించినట్రైలర్ విడుదలైంది. అయితే ట్రైలర్ నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమాతో పోలుస్తు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను ట్రైలర్ ఆకట్టుకునేలా ఉందని ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయిందని ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఎన్టీఆర్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.''ఆర్ఆర్ఆర్'' సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు, రామ్ చరణ్ కూడా ఉన్నారు. పైగా ఆ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించారు. దాంతో సింగిల్ హీరోగా ఎన్టీఆర్‌కు 'దేవర' సినిమానే తొలి ప్యాన్ ఇండియా మూవీ. అందుకే హిందీలోనే అధికంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఇంటర్వ్యూ, కపిల్ శర్మ షోలో ఎన్టీఆర్ సందడి చేశారు. త్వరలోనే తెలుగులో కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త ఒకటి వైరల్ అవుతోంది. దేవర సినిమా నుంచి 'దావుదీ' సాంగ్‌ను ఇటీవల విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పాట సినిమాలో ఉండదని తెలుస్తోంది.
వీటిలో ఎన్టీఆర్-జాన్వీ కపూర్ డ్యాన్స్‌తో అదరగొట్టిన 'దావుదీ' అనే సాంగ్ కూడా ఉంది. సినిమాలో సిట్చూయేషన్ సెట్ కాక చివర్లో టైటిల్స్ పడ్డప్పుడు ఈ పాటని ప్లే చేస్తారని తొలుత టాక్ వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సాంగ్‌ని పూర్తిగా థియేటర్ వెర్షన్ నుంచి తీసేశారని అంటున్నారు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే తారక్ మాస్ డ్యాన్స్ చూడటం కష్టమే. ఎందుకంటే 'చుట్టమల్లే' పాటలోనూ తారక్ డ్యాన్స్ చేశాడు. కాకపోతే అవి సింపుల్ స్టెప్స్. ఫియర్ సాంగ్, ఆయుధ పూజ ఎలివేషన్ సాంగ్స్ కాబట్టి వీటిలో తారక్ డ్యాన్స్ ఉండదు. మరి సినిమాలో 'దావుదీ' ఉంటుందా లేదా అనేది చూడాలి?
ఇక ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచియమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ''ఎందుకు పుట్టిందో'' సాంగ్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే ది బెస్ట్ సాంగ్‌గా నిలిచింది. 'ఆచార్య' వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో 'దేవర'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications