పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనేక వాయిదాల తర్వాత, ఈ భారీ బడ్జెట్ చారిత్రక యాక్షన్ డ్రామా జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది.

టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను తారా స్థాయికి చేర్చింది. పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ చూడని లుక్‌లో, శక్తివంతమైన బందిపోటు వీరమల్లుగా కనిపించి అభిమానులను ఉర్రూతలూగించారు. ఔరంగజేబు కాలంనాటి చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో, బందిపోటు వీరమల్లు కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడమే తన లక్ష్యంగా పని చేయబోతున్నట్టు ట్రైలర్ స్పష్టం చేసింది. ఇది దేశభక్తి, వీరోచిత పోరాటాల కలయికగా కనిపించడం ఆసక్తికరంగా మారింది.

Bad news for Pawan Kalyan fans

ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ నెగటివ్ పాత్రలో (ఔరంగజేబుగా) కనిపించనున్నారు. వారి నటన సినిమాకు మరింత బలాన్ని చేకూర్చనుంది.సినిమా గురువారం విడుదల కానుండగా, బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోస్ పడనున్నాయి. అయితే ఓవర్సీస్‌లో సినిమా విడుదల అవుతుందా లేదా అనమానం కలుగుతోంది.

పవన్ కళ్యాణ్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న 'హరి హర వీరమల్లు' ఓవర్సీస్ ప్రీమియర్స్ పట్ల ఆందోళన నెలకొంది. సినిమా కంటెంట్‌ను విదేశాలకు పంపడంలో మేకర్స్ నుంచి జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.

ఫస్ట్ హాఫ్‌కు సంబంధించిన కంటెంట్ నిన్ననే డెలివరీ అయినప్పటికీ, సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి పంపుతున్నారట. మరో రెండు గంటల్లోపు సెకండ్ హాఫ్ కంటెంట్ డెలివరీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

అయితే, ఒకవేళ సమయానికి కంటెంట్ డెలివరీ జరగకపోతే, ప్రీమియర్ షోలు కొన్ని రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఓవర్సీస్ ఫ్యాన్స్‌ను ఈ విషయం తీవ్రంగా కలవరపెడుతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో ఈ ఆలస్యం అభిమానుల్లో ఆందోళన రేపుతోంది. తమ అభిమాన హీరో సినిమా ప్రీమియర్‌ను సకాలంలో చూడగలమా లేదా అనే టెన్షన్‌తో ఓవర్సీస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+