బాలయ్యకు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా ఇదే
నందమూరి నటసింహం బాలకృష్ణకు, మెగాస్టార్ చిరంజీవికి 3 దశాబ్దాల నుంచి బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ ఉంది. వీరిద్దరి సినిమాలు విడుదలయ్యాయి అంటే అభిమానులు తీవ్రస్థాయిలో గొడవ పడుతుంటారు. అయినప్పటికీ నిజ జీవితంలో మాత్రం బాలయ్య, చిరు మంచి స్నేహంగా ఉంటారు. ఒకరి సినిమాలంటే మరొకరికి ఎంతో గౌరవం. చాలా సందర్భాల్లో ఇద్దరూ ఎదుటివారి సినిమాలపై పరస్పరం అభినందించుకునేవారు. అంతేకాకుండా స్నేహంగా మసులుకుంటారు.
చిరంజీవి, శ్రీదేవి కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది
బాలకృష్ణకు చిరంజీవి నటించిన సినిమాల్లో 'జగదేకవీరుడు అతిలోకసుందరి' అంటే బాగా ఇష్టం. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సోషియో ఫాంటసీ చిత్రం 1990 మేలో భారీ వర్షాల మధ్య విడుదలై సంచలన విజయాన్ని కైవసం చేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలో ఒక అద్భుతమని బాలయ్య పలు ఇంటర్వ్యూలలో జగదేకవీరుడు అతిలోక సుందరిపై ప్రశంసలు కురిపిస్తూ వచ్చేవారు. ఆ సినిమాలో చిరంజీవి-శ్రీదేవ మధ్య కెమిస్ట్రీ తనను బాగా ఆకట్టుకుందని, అంతేకాకుండా సినిమా మేకింగ్ స్టైల్ కూడా బాగా ఇష్టమని బాలయ్య చెప్పారు. ఈ మాటలు చిరంజీవి అభిమానులు చాలా ఖుషీ చేశాయి.

చిరంజీవి సినీ జీవితాన్ని మలుపు తిప్పిన ఖైదీ
అలాగే కెరీర్ ప్రారంభంలో చిరంజీవి సినీ జీవితాన్ని మలుపు తిప్పిన ఖైదీ అంతే కూడా తనకు ఎంతో ఇష్టమని బాలకృష్ణ చెప్పేవారు. చిరు సినిమాల్లో ఉంటే పోరాటాలు, నృత్యాలు, పోరాటాల్లో చిరంజీవి చూపించే గ్రేస్ తనకు చాలా ఇష్టమని అన్ స్టాపబుల్ షోలో కూడా బాలయ్య చెప్పారు. తన సమకాలీన హీరో, బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ పడే హీరో గురించి ఇంత పాజిటివ్ గా మాట్లాడటం బాలయ్యకు మాత్రమే సాధ్యమని ఆయన అభిమానులు మురిసిపోతుంటారు.
వీరిద్దరూ ఒకరి సినిమాలను మరొకరు చూస్తూ ప్లస్, మైనస్ పాయిట్లను చర్చించుకుంటుంటారు. బాలయ్య నటించిన నరసింహనాయుడు, సమరసింహారెడ్డి చిత్రాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఇవి కూడా తనకు చాలా ఇష్టమని చిరంజీవి చాలా సందర్భాల్లో మీడియాతో పంచుకున్నారు. ఒకరిపట్ల ఒకరికి ఉన్న గౌరవమే వారి స్నేహాన్ని ఇన్ని సంవత్సరాలుగా నిలబెడుతూ వస్తోందని సినీ విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications