'కూలీ' లో నాగార్జున క్యారెక్టర్ ని మిస్ చేసుకున్న తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?
ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ మూవీ హవా నడుస్తోంది. ఈ మూవీ ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమైంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ మూవీ భారీ అంచనాలతో తెరకెక్కింది. ఇటీవల రిలీజైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున, అమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన పాటలు ఓ ఊపు ఊపుతున్నాయి. అయితే ఇప్పుడు అందరి నోటా ఒకటే క్యారెక్టర్ గురించి వినిపిస్తోంది. అదే కింగ్ నాగార్జున చేసిన సైమన్ పాత్ర. ఈ పాత్రలో నాగార్జున స్టైలిష్ విలన్ గా రెచ్చిపోయారు. ఓ వైపు కూల్ గా నవ్వుతూనే భయపెట్టేస్తున్నారు. నాగ్ కెరీర్ లో ఇలాంటి పాత్ర చేయడం ఇదే మొదటి సారి కావడం విశేషం.
కూలీ మూవీలో నాగ్ క్యారెక్టర్ తో మూవీకి విపరీతమైన బజ్ ఏర్పడింది. అటు అమెరికాలోనూ ప్రి బూకింగ్స్ లో దూసుకెళ్తోంది కూలీ మూవీ. వార్ 2 మూవీ బుకింగ్స్ ను ఇప్పటికే దాటేసింది. దీంతో ఈ మూవీకి ఓవర్సీస్ లోనూ భారీ క్రేజ్ ఉన్న సంగతి అర్థమైతోంది. ఇక కింగ్ నాగార్జున.. ఈ మూవీలో డిఫరెంట్ గెటప్ లో విలన్ గా అదరగొట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల జూన్ లో విడుదలైన కుబేర చిత్రంలో తొలిసారిగా నాగ్.. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. అయితే మూవీ చివర్లో ఆయన తన తప్పు గ్రహించి మారిపోతాడు. ఇక లేటెస్ట్ కూలీ లో మాత్రం ఏకంగా ఫుల్ లెంగ్త్ విలన్ పాత్రలో మెరిశారు నాగార్జున.

అయితే ఈ క్యారక్టర్ ని నాగార్జున కంటే ముందుగా నందమూరి బాలకృష్ణ ని అడిగారట మూవీ టీమ్. కానీ బాలకృష్ణ అందుకు ససేమీరా ఒప్పుకోలేదని సమాచారం. ముఖ్యమైన పాజిటివ్ రోల్ అయితే చేస్తాను కానీ.. ఇతర హీరోల సినిమాల్లో నెగిటివ్ రోల్ చేసే ప్రసక్తే లేదు అని ముఖం మీదనే చెప్పేశాడట. ఇక ఆ తర్వాత నాగార్జున ని సంప్రదించడం, ఆయన ఒకటికి ఆరు సార్లు కథ విని ఓకే చెప్పడం జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఆగస్టు 14 న విడుదల కానున్న ఈ మూవీ ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications