వైరల్ వీడియో: బాలకృష్ణకు స్టేజీపైనే లవ్ ప్రపోజ్.. బాలయ్య షాకింగ్ రియాక్షన్..!
ప్రముఖ నటుడు, నందమూరి నటసింహం బాలకృష్ణకు ఓ మహిళా యాంకర్.. రోజా ఫ్లవర్ అందించి.. వాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ ఫ్లవర్ ను ఆయన తనదైన శైలిలో పైకి విసిరి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాలయ్య ఎక్కడ ఉన్నా సందడిగా ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

నందమూరి నటసింహం బాలకృష్ణ ఎక్కడైనా చాలా సరదాగా, హుషారుగా కనిపిస్తుంటారు. తనదైన శైలిలో పంచ్ లు వేస్తూ అక్కడివారిని నవ్విస్తుంటారు. అయితే తాజాగా బాలయ్య ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆ ఈవెంట్ లో ఓ మహిళా యాంకర్.. బాలకృష్ణకు రోజ్ ఫ్లవర్ ఇచ్చి వాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. దాంతో బాలయ్య తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఆ ఫ్లవర్ ను పైకి విసిరి పట్టుకున్నారు.ఆ తర్వాత గులాబీని సూట్ పాకెట్ లో పెట్టుకుని ప్రసంగించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
Anchor Love Proposes to Balakrishna : నటుడు బాలకృష్ణకు మహిళా యాంకర్ లవ్ ప్రపోజ్ #shorts #politikosmedia #Balakrishna #HindupurMLA #ValentinesDayEvent #Actor #TollywoodNews #AnchorProposal #ViralVideo #Balayya #TeluguCinema #CelebrityNews #TrendingVideo pic.twitter.com/fzVSEerrxY
— Politikos Media (@PolitikosM94857) February 15, 2026
అన్విత గ్రూప్(రియల్ ఎస్టేట్ సంస్థ) శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు బాలయ్య పాల్గొన్నారు. బాలకృష్ణ వేదికపైకి రాగానే ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా యాంకర్ విష్ చేశారు. ఇక బాలయ్య గతేడాది అఖండ 2 చిత్రంతో అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ మూవీ చేస్తున్నారు బాలయ్య. అలాగే బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటితోనూ మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.












Click it and Unblock the Notifications