శ్యామ్ సింగరాయ్ దర్శకునితో బాలయ్య పీరియాడికల్ మూవీ...
టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ వరుస విజయాలతో ముందుకు దూసుకెళుతున్నారు. చేతినిండా సినిమాలతో ఈ వయసులో కూడా ఫుల్ బిజిగా ఉన్నారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో బాలయ్య బాబు ఫుల్ బిజీ బిజి.. ఈ మధ్య వచ్చిన ఆఖండ, భగవంత్ కేసరీ వంటి సినిమాలు మంచి విజయాలను అందించాయి. ప్రస్తుతం బాలయ్య తన 109వ సినిమా షూటింగు పనుల్లో బిజిగా ఉన్నారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించనున్నారు. బాబీ సినిమా అనంతరం బాలకృష్ణ అఖండ్ సీక్వెల్ చేయబోతున్నారని టాక్. ప్రస్తుతం ఆ పనుల్లోనే బోయపాటి ఉన్నట్లు సమాచారం.
ఈ మధ్య బాలకృష్ణ యువ దర్శకులకి అవకాశమిస్తున్నారు. ఈ మధ్యనే అనిల్ రావిపూడి వంటి యువ దర్శకునికి ఛాన్స్ ఇచ్చిన బాలకృష్ణ, తన కెరియర్ లోనే అత్యధిక వసూళ్లను చవి చూడడం జరిగింది. అలాగే ఇప్పుడు తాజాగా బాలయ్య బాబు మరో యువ దర్శకుడికి అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ యంగ్ డైరెక్టర్ ఎవరో కాదు. 'రాహుల్ సంకృత్యన్. 'శ్యామ్ సింగరాయ్ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు రాహుల్. ఇప్పడు బాలయ్య ఇతనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టు కు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు : రాహుల్ సంకృత్యన్ రీసెంటుగా బాలకృష్ణను కలిసి కథ చెప్పాడనీ, బాలయ్య కూడా కథకు వెంటనే ఒకే ఇచ్చారని సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. అయితే, ఈ సినిమా కోసం భారీ నిర్మాణ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కథ, కథనాలు చాలా కొత్తగా ఉండటంతో వెంటనే ఈ ప్రాజెక్టు కు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. రాహుల్ కూడా ఈ కథకు బాలయ్య అయితేనే బాగుంటుందని ముందు ఆయనకే చెప్పారట. ఇక, ఈ సినిమా పీరియాడికల్ మూవీగా ఉండబోతుందని టాక్. 'అఖండ సీక్వెల్ అనంతరం బాలకృష్ణ బాబు ఈ సినిమా పనిలో ఉంటారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications