'NBK 111' రిలీజ్ డేట్ ఇదే..? సంక్రాంతికి ముందే థియేటర్లలో బాలయ్య విధ్వంసం..!

నందమూరి బాలకృష్ణ సినిమా అంటే థియేటర్ల వద్ద పండగ వాతావరణం ఉంటుంది. టాలీవుడ్ లో గాడ్ ఆఫ్ మాసెస్ గా, నందమూరి నటసింహం బాలయ్య తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలికాలంలో ఒక్కో సినిమాతో బ్లాక్ బస్టర్ కొడుతూ కుర్ర హీరోలకు పోటీగా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇటీవల అఖండ 2 తో పాన్ ఇండియా రేంజ్ లో అలరించిన బాలయ్య ఇప్పుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. 'NBK 111' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది.

అయితే బాలయ్య - గోపిచంద్ మలినేని కాంబోలో వస్తున్న ఈ మూవీకి సంబంధించి ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 24 న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాలయ్య - గోపిచంద్ మలినేని కాంబోలో ఇదివరకు వీరసింహారెడ్డి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. వీరసింహారెడ్డి మూవీని మించిన హిట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇక ఇటీవల ఈ మూవీ షూటింగ్ కాకినాడలో జరుగుతున్న క్రమంలో బాలయ్యకు ప్రమాదం జరగడంతో మోకాలు సర్జరీ చేశారు. దాంతో కొద్ది రోజులుగా బాలయ్య విశ్రాంతి తీసుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ షూటింగ్ లో బాలయ్య పాల్గొనే అవకాశం ఉంది. అనుకున్న ప్లాన్ ప్రకారం.. అక్టోబర్, నవంబర్ లో నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి.. నవంబర్ చివరి నాటికి టాకీ పార్ట్ అలాగే పాటలు పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. డిసెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్, ప్రొమోషన్ పనులను వేగవంతం చేసి క్రిస్మస్ హాలీడేస్ కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయాలని టీమ్ భావిస్తోంది.

Balayya The film unit is planning to release the Balayya-Gopichand Malineni movie on December 24

ఇటీవల బాలయ్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ రేంజ్ యాక్షన్ కొరియోగ్రఫీ, భారీ నిర్మాణ విలువలు, విజువల్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్​ మ్యూజిక్ గ్లింప్స్‌ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. వెంకట సతీశ్​ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోందనడంలో సందేహం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+