కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!

కోర్టు మూవీతో సెన్సేషనల్ హిట్ అందుకున్న జంట హర్ష్ రోషన్, శ్రీదేవీ. ఇప్పుడు ఈ జంట మళ్లీ 'బ్యాండ్ మేళం' అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చేసింది. సతీష్ జవ్వాజీ దర్శకతవకం వహించిన ఈ మూవీని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, అలాగే మాస్ పెప్పీ సాంగ్ 'తిప్పూ కుంటున్నావ్', మెలోడీ సాంగ్ 'పల్లెలోని సందల్లన్ని మీవే' ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి స్పందన పొందాయి. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్‌లో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. గ్రామీణ నేపథ్యం, ప్రేమ కథ, వినోదం కలిసిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ మూవీతో ఈ యంగ్ జోడీ హిట్ అందుకుందా ? లేదా ?? తెలుసుకుందాం..

band-melam-movie-telugu-review-and-rating-starring-hit-movie-court-fame-harsh-roshan-and-sridevi

సినిమా స్టోరీ..

తెలంగాణలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గిరి (హర్ష్ రోషన్), రాజీ (శ్రీదేవి) చిన్నప్పటి నుంచి బావమరదళ్లుగా పెరిగి ఒకరినొకరు ఇష్టపడతారు. కుటుంబ సభ్యులు కూడా వారి పెళ్లి గురించి ఆలోచిస్తారు. కానీ కాలక్రమంలో పరిస్థితులు మారిపోతాయి. గిరి కుటుంబం అప్పుల్లో కూరుకుపోతే, రాజీ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుంది. చదువులో వెనుకబడిన గిరి బ్యాండు మేళం నడుపుతుంటే, రాజీ చదువులో మెరుగ్గా రాణిస్తూ ఇంజనీరింగ్‌లో చేరుతుంది. గిరి ప్రేమను రాజీ పట్టించుకోదు. ఇదే సమయంలో ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. అయితే పెళ్లి రోజునే రాజీ తన క్లాస్‌మేట్‌తో వెళ్లిపోవడం కథలో కీలక మలుపు. తర్వాత ఏమైంది? తిరిగి గిరి జీవితంలోకి ఎలా వచ్చింది? అన్నది కథలో ప్రధాన అంశం.

మూవీ రివ్యూ..

కోన వెంకట్ రచించిన ఈ సినిమా, కామెడీ ఫ్యామిలీ డ్రామా జానర్‌లోనే సాగుతుంది. కానీ కథ, కథనం రెండూ పాత ఫార్ములానే అనిపిస్తాయి. కొత్తదనం లేకపోవడం ప్రధాన మైనస్. హీరో పేదవాడు, హీరోయిన్ ధనవంతురాలు, ప్రేమకు అడ్డంకులు-ఇలాంటి రొటీన్ అంశాలతో కథ ముందుకు సాగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో బ్యాండు మేళం సన్నివేశాలు కొంత వినోదాన్ని అందిస్తాయి. ఇంటర్వెల్ వరకు కథ ఆసక్తిగా అనిపించినా, సెకండ్ హాఫ్‌లో నెమ్మదిగా మారుతుంది. క్లైమాక్స్ కూడా ముందే ఊహించగలిగేలా ఉంటుంది.

నటీనటులు & టెక్నికల్ అంశాలు..

హర్ష్ రోషన్ గిరి పాత్రలో ఎనర్జీగా నటించి ఆకట్టుకున్నాడు. డ్యాన్స్ కూడా బాగుంది. శ్రీదేవి రాజీగా మంచి నటన కనబరిచింది. సాయికుమార్ తన అనుభవంతో పాత్రకు న్యాయం చేశాడు. హీరో గ్యాంగ్‌లో కొత్తవాళ్లు అయినా సరే బాగానే నటించారు.

టెక్నికల్‌గా సినిమా ఓకే. విజయ్ బుల్గానిన్ సంగీతం బాగుంది. 'తిప్పుకుంటున్నవావే' పాట ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు మంచి స్థాయిలో ఉన్నాయి. మొత్తం మీద ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదు.

రేటింగ్..

2/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+