దేవుడు అన్నానని పవన్ కల్యాణ్‌ను బెడ్ రూమ్‌లో పెట్టుకోలేను కదా..!
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. గత కొంతకాలంగా వరుసగా వార్తల్లో నిలుస్తున్నారాయన. తెలంగాణ ఎన్నికల సమయంలో ఆయన మీడియాలో తెగ హల్ చల్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుగా బండ్ల గణేష్ ప్రచారం కూడా నిర్వహించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సమయంలో బండ్ల గణేష్ చేసిన హడావిడి అంత ఇంత కాదు.
ఫలితాల సమయంలో తనదైన శైలిలో బీఆర్ఎస్ పార్టీపై ట్విట్లు చేశారాయన. బండ్ల గణేష్ పవన్ కల్యాణ్‌కు వీర భక్తుడనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్ నటించిన తీన్‌మార్, గబ్బర్ సింగ్ సినిమాలకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాతోనే బండ్ల గణేష్ ఇండస్ట్రీలో నిర్మాతగా నిలదొక్కుకున్నారు.కొంతకాలంగా ఆయన సినిమాలకి దూరంగా ఉన్నా సినిమా ఇండస్ట్రీ మాత్రం ఆయన్ని దూరం చేసుకోలేదు. పలు సినిమాల ప్రీ రిలీజ్, సక్సెస్ మీట్లకు హాజరవుతూ ఆయన చేసే కామెంట్స్ తెగ వైరల్ అవుతుంటారు. బండ్ల గణేష్ ఈవెంట్‌కి వస్తున్నాడంటే కచ్చితంగా రచ్చ జరుగుతుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు.

తనకు నచ్చిన వ్యక్తిపై ఎంతగా ప్రశంసలు కురిపిస్తాడో.. ఎవరైనా నచ్చకపోతే ట్వీట్లు ద్వారా సెటైర్లు వేస్తుంటారు. పవన్ కళ్యాణ్‌కి భక్తుడినని చెప్పుకునే బండ్ల గణేష్ ఆయన్ని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోరు. గతంలో ఈశ్వరా.. పరమేశ్వరా.. పవనేశ్వరా.. అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఇచ్చిన స్పీచ్ తెగ వైరల్ అయింది. పవన్ కళ్యాణ్‌ని ప్రశంసలతో ఉక్కిరిబిక్కిరి చేసే బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో ఆయన ఊసు పెద్దగా ఎత్తడం లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్లకు ఆయన్ని ఆహ్వానించక పోవడంతో అలిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్లతో పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా ఆయన ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భగవద్గీత సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా చెబుతున్న అమ్మ, నాన్న తర్వాత భార్య పిల్లలే తనకు ప్రాధాన్యత అని తేల్చేశారు. నా వరకు తల్లిదండ్రులు, భార్య, పిల్లల తర్వాతే ఎవరైనా. నాకు ఎవ్వరూ లేరు సర్వస్వం మీరే, నా భార్య నా పిల్లల కంటే మీరే ఎక్కువ, మా అమ్మ నాన్నల కంటే మీరే ఎక్కువ అని అన్నాము అంటే అది పచ్చి బూతు అవుతూందని బండ్ల గణేష్ తెలిపారు. దేవుడు అన్నానని పవన్ కల్యాణ్‌ను బెడ్ రూమ్‌లో పెట్టుకోలేను కదా.. అంటూ ఆయన పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ తనకు దేవుడైనా సరే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతానని అన్నారు బండ్ల గణేష్. ప్రస్తుతం పవన్ కల్యాణ్ గురించి బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ : భగ్గుమన్న ఏపీ నెటిజెన్లు -
'ధురంధర్' కు నో చెప్పిన స్టార్ హీరోయిన్.. ఓకే చెప్పి ఉంటే మూవీ ప్లాఫ్..?? -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
ధురంధర్2 సూపరంట..పవన్ కల్యాణ్ సినిమా గురించి నోరు తెరవని మన ‘భజన’ హీరోలు












Click it and Unblock the Notifications