బిగ్‌బాస్‌లోకి పొలిటికల్ లీడర్ ..ఇక రచ్చ రచ్చే..!
మరి కొద్ది గంటల్లో తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ షో ఆరంభం కానుంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోలు షోపై అంచనాలు మరింత పెంచేశాయి. తాజాగా విడుదల చేసిన ప్రోమోతో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. గత సీజన్ల భిన్నంగా ఈ సీజన్ ఉండబోతుందని ప్రోమో చూస్తే అర్థం అవుతోంది. సింగిల్‌గా వెళ్లడానికి వీల్లేదని నాగార్జన కంటెస్టెంట్లకు తేల్చి చెప్పారు. మీరు కపుల్స్ లాగే వెళ్లండి.. మీ ఇష్టమొచ్చినట్టు మీరు కథలు నడిపించుకోండంటూ వాళ్ళకి కావాల్సిన కంటెంట్ వాళ్లకి ఇవ్వండని కామెంట్స్ చేశారు.దీంతో గతానికి భిన్నంగా ఈ సీజన్ ఉండబోతుందని అర్థం అవుతోంది.
అలాగే ఈసారి బిగ్‌బాస్‌లో ఇక ఈసారి జరగబోయే సీజన్‌లో టీవీ ఆర్టిస్టులతో పాటు, సినిమా వారిని కూడా అధిక సంఖ్యలో తీసుకుంటారని తెలుస్తోంది. తొలిసారి పొలిటికల్‌కు సంబంధించిన వ్యక్తిని కూడా ఈ సీజన్‌కు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఆ వ్యక్తి మరెవ్వరో కాదు.. బర్రెలక్క. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బర్రెలక్క పెను సంచలనమే సృష్టించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయింది. ఆ ఎన్నికల్లో రాజకీయ నాయకుల కన్నా బర్రెలక్కనే ఎక్కువ ఫేమస్ అయింది.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి..రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత గుర్తింపు తెచ్చుకుంది. దీంతో సోషల్ మీడియాలో బర్రెలక్క పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 5754 ఓట్ల సాధించి ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బర్రెలక్క చాలామందికి ఆదర్శంగా నిలిచింది. దీంతో ఆమెను బిగ్‌బాస్‌లోకి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆమె అందరితో పాటు కాకుండా , వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.
ఈసారి బిగ్‌బాస్‌కు వచ్చే కంటెస్టెంట్ల లిస్ట్‌ను ఓసారి పరిశీలిస్తే..
1. అఫ్రిది
2. యాష్మి గౌడ
3. కమెడియన్ అభయ్
4. డ్యాన్సర్ నైనిక
5. హీరో ఆదిత్య ఓం
6. విష్ణుప్రియ
7. పృథ్వీరాజ్
8. మణికంఠ
9. సోనియా
10. సీత
11. శేఖర్ భాష
12. బేబక్క
13. నిఖిల్
14. ప్రేరణ












Click it and Unblock the Notifications