రాంగ్ రూట్లో కారు నడుపుతూ పోలీసుల దగ్గర బుక్ అయిన యంగ్ హీరో.. !
రాంగ్ రూట్ లో కారు నడుపుతూ వస్తున్న ఓ యువకుడికి కానిస్టేబుల్ షాక్ ఇచ్చాడు. ఇది కరెక్ట్ కాదంటూ వారించడంతో కారును వెనక్కి తిప్పుకొని వెళ్లిపోయాడు. అయితే ఆ కారు నడుపుతున్న వ్యక్తి టాలీవుడ్ యంగ్ హీరో. ఈ తతంగం అంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. రూల్స్ విషయంలో పబ్లిక్ అయినా, సెలబ్రిటీలు అయినా అందరూ సమానమే అని చెప్పడానికి ఇదో ఉదాహరణ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇంతకీ రాంగ్ రూట్లో కారు నడుపుతూ అడ్డంగా బుక్ అయిన హీరో ఎవరా అనుకుంటున్నారా.. మన బెల్లం బాబే. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో "బెల్లంకొండ సాయి శ్రీనివాస్" కూడా ఒకరు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా.. సాయి శ్రీనివాస్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటు వంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. తనదైన శైలిలో విభిన్న పాత్రలు చేస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, రాక్షసుడు, సీత, అల్లుడు అదుర్స్ వంటి చిత్రాల్లో నటించాడు. రీసెంట్ గానే ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడంతో.. కొంచెం గ్యాప్ తీసుకొని "భైరవం" అనే మూవీతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు సాయి శ్రీనివాస్.
భైరవం సినిమాలో సాయి శ్రీనివాస్ తో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే ఆ మూవీతో పాటు కిష్కిందపురి, టైసన్ నాయుడు, హైందవ వంటి సినిమాలను లైన్‌లో పెట్టాడు ఈ యంగ్ హీరో. మరోవైపు ట్రాఫిక్ కానిస్టేబుల్ తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
🚨హైదరాబాద్ జూబ్లీహిల్స్ దగ్గర రాంగ్ రూట్లో వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్..
— Indiansainma (@IndianSainma) May 13, 2025
ట్రాఫిక్ కానిస్టేబుల్ సీరియస్ అవ్వడంతో కారు వెనక్కి తిప్పిన హీరో.#BellamkondaSreenivaspic.twitter.com/HE581nRZtY












Click it and Unblock the Notifications