200 మంది ముందే సమంతతో రొమాంటిక్ సీన్స్..!

"బెల్లంకొండ సాయి శ్రీనివాస్".. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా.. సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటు వంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. తనదైన శైలిలో విభిన్న పాత్రలు చేస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, రాక్షసుడు, సీత, అల్లుడు అదుర్స్‌ వంటి చిత్రాల్లో నటించాడు.

కాగా ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడంతో.. కొంచెం గ్యాప్ తీసుకొని భైరవం, కిష్కిందపురి అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్వరలోనే టైసన్‌ నాయుడు, హైందవ వంటి సినిమాలను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన డెబ్యూ సినిమా అల్లుడు శీను షూటింగ్ రోజుల్ని గుర్తు చేసుకుంటూ పలు కామెంట్స్ చేశారు. సమంతతో రొమాంటిక్ సీన్స్ గురించి చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

bellamkonda-sai-srinivas-comments-about-doing-romantic-scenes-with-samantha-goes-viral

బెల్లంకొండ శ్రీనివాస్ ఏమన్నారంటే..

అల్లుడు శీను సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు రోజు షూటింగ్ సమయంలో సెట్స్‌పై సుమారు 200 మంది క్రూ సభ్యులు ఉండేవారని తెలిపారు. అయితే షూటింగ్ లో ఫైట్ సీన్లు చేస్తున్నప్పుడు గానీ, డ్యాన్స్‌ చేస్తున్నపుడు గానీ ఎవ్వరూ తనవైపు పెద్దగా చూసేవాళ్ళు కాదన్నారు. ఎవరు కనీసం తనను పట్టించుకునే వారు కాదని.. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేవారని చెప్పుకొచ్చారు. కానీ హీరోయిన్ సమంతతో రొమాంటిక్ లేదా కిస్సింగ్ సీన్ ఉంటే మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోతుందని ఓపెన్ అయ్యారు.

ఆ సన్నివేశాలు షూట్ చేస్తుంటే సెట్స్‌లో ఉన్న 200 మంది క్రూ సభ్యులంతా తన దగ్గరికి వచ్చి చూసేవాళ్లని.. ఆ సమయంలో తాను కొంచెం అసౌకర్యంగా ఫీల్ అయ్యేవాడినని తెలిపారు. అయితే అంతమంది ఉన్నా సమంత మాత్రం చాలా ప్రొఫెషనల్ గా వ్యవహరించారని ఆయన ప్రశంసించారు. తనకి కొత్త కావడంతో మొదట్లో కాస్త తడబడ్డా, సమంత అందించిన సహకారంతో ఆ సీన్స్ ని పూర్తి చేయగలిగానని గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సమయంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో అని కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+