థియేటర్లలో చిన్న సినిమా ప్రభంజనం.. రూ. 300 కోట్లకుపైగా కలెక్షన్స్

ఇటీవలి కాలంలో ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారింది. కంటెంట్ లేకపోతే పెద్ద హీరోల సినిమాలు.. భారీ బడ్జెట్ సినిమాలు అయినా పక్కన పెట్టేస్తున్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అనే విధంగా చిన్న సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తున్నారు. తెలుగులోనే కాదు పాన్ ఇండియా రేంజ్ లో అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ దాదాపు ఇదే విధానం కొనసాగుతోంది. తాజాగా మలయాళం ఇండస్ట్రీలో అద్భుతం జరిగింది. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఓ చిన్న సినిమా ఇప్పుడు కేరళ బాక్సాఫీస్ చరిత్రలోనే ఆల్‌ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అదే 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' మూవీ.. మలయాళం యంగ్ హీరో నివిన్ పౌలీ, బ్లాక్ బస్టర్ బ్యూటీ మమితా బైజు కాంబోలో వస్తున్న యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఆగస్టు 21 న విడుదల అయింది.

ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో ఈ మూవీ 23 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఒక్క కేరళ రాష్ట్రంలోనే రూ. 130 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి మలయాళ ఇండస్ట్రీలోనే అత్యధిక వసూల్లు సాధించిన చిత్రంగా నిలిచింది.ఇదే ఊపు కొనసాగితే కేరళ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' చిత్రం నిలిచే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మలయాళం హీరో నివిన్ పౌలీకి ప్రేమమ్ మూవీ తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో హిట్ పడినట్లు చెప్పొచ్చు.

BethlehemFamilyUnit Made on budget of 30 crore raked in 300 crore a sensational hit at box office

రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందిన ఈ సినిమాను దర్శకుడు గిరీష్ ఏడీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఆయన తొలి సినిమా ప్రేమలు ఏ రేంజ్ విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు రెండో చిత్రంతో అంతకు మించిన విజయాన్ని అందుకున్నారు దర్శకుడు గిరీష్ ఏడీ. ఇక ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ నెల 4వ తేదీన వచ్చింది. తెలుగులోనూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. చాలా కాలం తర్వాత ఓ మంచి ఫ్యామిలీ సినిమా చూశామన్న సంతృప్తితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తున్నారని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ పెడుతున్నారు. ఇక మున్ముందు ఈ మూవీ ఇంకెన్ని రికార్డుల్ని కొళ్లగొడుతుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+