నడవలేని స్థితిలో స్టార్ డైరెక్టర్.. కన్నీళ్లు ఆగట్లేదు !

భారతీయ సినీ ప్రస్థానంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో "భారతీ రాజా" ఒకరు. 1941 జూలై 17న తమిళనాడులో జన్మించిన భారతీ రాజా అసలు పేరు చిన్నసామి. థియేటర్ నేపథ్యంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. కాగా 1977లో విడుదలైన "16 వైయతినిలే" సినిమాతో రాజా దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ సినిమా తమిళ సినిమాకు కొత్త యుగాన్ని తెచ్చిపెట్టింది. కమల్ హాసన్, రజనీకాంత్‌లకు ఈ సినిమా కెరీర్ టర్నింగ్ పాయింట్‌గా మారింది.

మరోవైపు దర్శకుడిగా మాత్రమే కాకుండా, కొత్త నటులను పరిచయం చేయడంలోనూ భారతీ రాజా కీలక పాత్ర పోషించారు. కమల్ హాసన్, రజనీకాంత్, సత్యరాజ్, భాగ్యరాజ్, రాధిక, రేవతి వంటి పలువురు నటులు ఆయన సినిమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు. "కిజక్కే పోగుమ్ రైలు", "సిగప్పు రోషక్కల్", "కాదల్ ఓవియం", "అలైగళ్ ఓయ్వదిల్లై", "ముధల్ మరియాదై", "వేదం పుదిథు", "తాజ్ మహల్" వంటి సినిమాలు ఆయనకు మంచి హిట్స్ ఇచ్చాయి.

bharathi-raja-present-health-condition-makes-fans-and-celebrities-turns-into-emotional-and-video-got

కాగా కాలక్రమేణా భారతీ రాజా నటుడిగా కూడా తన ప్రతిభను చూపించారు. ముఖ్యంగా తండ్రి పాత్రలు, సీనియర్ క్యారెక్టర్లలో ఆయన నటన ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంది. వయసు పెరిగినా ఆయన నటనలోని సహజత్వం మాత్రం తగ్గలేదు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో భారతీ రాజా అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు. జీవితకాల సాఫల్య పురస్కారాలతో పాటు, తమిళ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన గౌరవాలు ఆయన సేవలకు నిదర్శనంగా నిలిచాయి.

అయితే కొన్నాళ్ల క్రితం భారతీరాజా ఏకైక కుమారుడు, నటుడు, దర్శకుడు మనోజ్ భారతీరాజా ఆకస్మిక మరణం ఆయనను తీవ్ర దుఃఖానికి గురిచేసింది. ఆ బాధ నుండి కోలుకోవడానికి మలేషియాలోని కుమార్తె ఇంట్లో కొన్ని నెలలు విశ్రాంతి తీసుకున్నారు. ఆపై చెన్నైకి తిరిగి వచ్చారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఇప్పుడు నడవలేని స్థితిలో ఇంట్లోనే వీల్ చైర్ లో విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

లేటెస్ట్ గా భారతీరాజాను రాధికా శరత్ కుమార్ కలిశారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా ఆమె షేర్ చేశారు. దీంతో భారతీ రాజాను నడవలేని స్థితిలో చూసిన ఆయన అభిమానులు, పలువురు ప్రముఖులు సైతం ఎమోషనల్ కామెంట్స్ చేస్తూ ఆయన పూర్తి ఆరోగ్యంతో త్వరగా కొలుకోవాలని పోస్ట్ చేస్తున్నారు.

`

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+