ఇండియాలో అతిపెద్ద డిజాస్టర్ మూవీ
సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులకు నచ్చకపోతే పరాజయం పాలవడం సహజం. కనీసం నిర్మాతకు పెట్టిన ఖర్చులవరకన్నా డబ్బులు వచ్చేవి. అయితే అదంగా గతం. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో రివ్యూలు వస్తుండటంతో ప్రేక్షకులకు వీటినిబట్టి అంచనా వేసుకొని మరీ సినిమాలకు వెళుతున్నారు. ఒకవేళ రివ్యూ వ్యతిరేకంగా ఉంటే ఆ సినిమాకు వెళ్లడం ప్రేక్షకులు మానుకుంటున్నారు. దీంతో పెట్టుబడుల సంగతి దేవుడెరుగు.. చేతిఖర్చులకు కూడా డబ్బులు రాని పరిస్థితి నెలకొంది. దేశంలోని అన్ని భాషల్లో సినిమాలు విడుదలై ఫ్లాపవుతున్నప్పటికీ ఇటీవల వచ్చిన ఓ చిత్రం మాత్రం దేశంలో అతి పెద్ద డిజాస్టర్ సినిమాగా నిలిచింది.
నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చింది
ఎన్నో ఆశలు, అంచనాలతో శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు2 చిత్రం థియేటర్లలోకి అడుగుపెట్టింది. 28 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలవగానే ఎవరికీ నచ్చలేదు. దీనిమీద భారీగా ట్రోలింగ్ జరిగింది. విడుదలైన తర్వాత అంచనాలు భారీగా ఉండటంతో తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.65 కోట్ల గ్రాస్ రాబట్టింది. తర్వాత రోజు నుంచి ఒక్కసారిగా పడిపోయింది. ఇప్పటివరకు రూ.148 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. సినిమా బడ్జెట్ రూ.225 కోట్లు కాగా నిర్మాతకు రూ.100కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది.

తన డబ్బులు కాకపోతే శంకర్ ఎంతైనా ఖర్చుపెట్టిస్తాడు
ఒకప్పుడు భారతీయుడు సినిమా అంటే సంచలనం. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. భారతీయుడు2 కూడా గతంలో షూటింగ్ జరుపుకొని ఆగిపోయింది. పాత చింతకాయ పచ్చడిలాంటి సినిమా శంకర్ తీశారంటూ అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తమిళంలో కూడా దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. అన్ని భాషల్లో ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ రూ.120 కోట్లకు కొనుగోలు చేసింది. ఓటీటీల్లో కూడా ఎవరూ చూడలేదు. మొదటినుంచి కమల్ హాసన్ భారతీయుడు3 వద్దని, మొత్తం కథను భారతీయుడు2లో చెబుదామని శంకర్ కు చెబుతున్నప్పటికీ సినిమాను రెండు భాగాలుగా, మూడు భాగాలుగా తీయాలనే మోజులో కథను సాగదీయడంతో దేశంలోనే అతి పెద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. డబ్బులు తన సొంతజేబులోనివి కాదుకాబట్టి శంకర్ ఇలాగే ఖర్చుపెట్టిస్తాడంటూ నెటిజన్లు అతన్ని తిట్టిపోస్తున్నారు.












Click it and Unblock the Notifications