ఇండియాలో అతిపెద్ద అట్టర్‌ఫ్లాప్ మూవీ ఇదే
సినిమా విడుదలైన తర్వాత నచ్చడం, నచ్చకపోవడం అన్నది ప్రేక్షకుల ఆలోచనలపై ఆధారపడివుంటుంది. సినిమా ఏమాత్రం బాగోలేదు అన్న వార్త వినపడిందంటే చాలు ఆ సినిమా ఫ్లాప్ కింద లెక్కే. ఈరోజుల్లో డిజిటల్ మీడియా అందుబాటులో ఉండటం, దాని ప్రభావం ఎక్కువగా ఉండటంతో సినిమాకు సంబంధించిన రివ్యూలు వస్తున్నాయి. రివ్యూలో బాగోలేదు అన్నా చాలు.. ప్రేక్షకులెవరూ ఆ సినిమావైపు తొంగిచూడటంలేదు. అంతగా కావాలంటే ఓటీటీలో వచ్చినప్పుడో, టీవీలో వచ్చినప్పుడో చూసుకోవచ్చులే అన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఫ్లాప్ సినిమాకు థియేటర్లకు వెళ్లి వేలకు వేలరూపాయలు తగలెయ్యడం ఎందుకు అన్న ఆలోచనకు ఎప్పుడో వచ్చేశారు.
నిర్మాత రూ.100 కోట్లకు పైగా మునిగిపోయాడు
ఇటీవల విడుదలైన ఓ సినిమా మాత్రం మనదేశంలో అత్యంత చెత్త సినిమాగా, డిజాస్టర్లలో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. అది ఏదో కాదు.. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు2 చిత్రం. భారతీయుడు సినిమా విడుదలైన 28 సంవత్సరాల తర్వాత ఎవరైనా, ఏ దర్శకుడైనా సీక్వెల్ తీస్తారా?.. కానీ శంకర్ తీశాడు.. ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవడమేకాదు.. నిర్మాతను నిండా ముంచేశాడు. కమల్ హాసన్ కు అప్రతిష్ట తెచ్చిపెట్టాడు. సినిమా విడుదలైన మొదటిరోజు రూ.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అంతే... ఆ తర్వాత ఏమీ రాలేదు. సినిమా బడ్జెట్ రూ.225 కోట్లు కాగా నిర్మాతకు రూ.100 కోట్లకు పైగా నష్టాలను తెచ్చిపెట్టింది.

ఆ హీరో వద్దని చెబుతున్నా వినకుండా
సినిమా లాంగ్ రన్ లో రూ.148 కోట్లు అన్ని భాషల్లో కలిపి భారతీయుడు2 రాబట్టింది. ఒకప్పుడు భారతీయుడు సినిమా అంటే ప్రభంజనం అని చెప్పొచ్చు. అంతగా బ్లాక్ బస్టర్ అవడమేకాదు.. సంచలన చిత్రంగా నిలిచింది. అలాంటి సినిమాకు సీక్వెల్ అప్పుడే తీయాలికానీ 28 సంవత్సరాల తర్వాత ఎవరైనా తీస్తారా? అంటూ సినీ ప్రియులంతా మండిపడ్డారు. అత్యంత చెత్తగా సినిమాను తీశాడని, పాటల కోసం భారీగా ఖర్చుచేయించాడని, మొదటి నుంచి కమల్ హాసన్ భారతీయుడు2 వద్దని చెబుతున్నప్పటికీ వినకుండా సినిమాను ప్రారంభించాడు. గేమ్ ఛేంజర్ సినిమా తీస్తూ మధ్యలో దీన్ని ఆపేసి వెళ్లి దాన్ని పూర్తిచేసి విడుదల చేసి గేమ్ ఛేంజర్ మీద కూడా ఎవరికీ ఆశలు లేకుండా చేశాడు. నిర్మాతలచేత శంకర్ డబ్బులను భారీగా ఖర్చుచేయిస్తాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. భారతీయుడు2తో పాత చింతకాయ పచ్చడిలాంటి సినిమా తీసి తనకున్న మంచి పేరును కూడా పోగొట్టుకున్నాడని, ఆ పేరు తిరిగి రావాలంటే గేమ్ ఛేంజర్ బ్లాక్ బస్టర్ అయితేనే సాధ్యమని అంటున్నారు.












Click it and Unblock the Notifications