అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !!
"ముకుంద" సినిమాతో టాలీవుడ్ కి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు మెగా హీరో వరుణ్ తేజ్. తొలి నుంచే విభిన్న కథలు, కొత్త జానర్లతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకున్నారు. ఫిదా, గద్దలకొండ గణేష్ వంటి సినిమాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన.. ప్రయోగాలకు వెనుకాడని హీరోగా గుర్తింపు పొందారు. అయితే ఇటీవల వరుస పరాజయాలు ఎదురవ్వడంతో వరుణ్ తేజ్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై గట్టిగానే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. కాగా ఇప్పుడు లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన కొత్త సినిమా.. టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
చెల్లి నిర్మాత.. అన్న హీరో !!
వరుణ్ తేజ్ హీరోగా.. ఆయన చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మాణంలో కొత్త మూవీ స్టార్ట్ అయ్యింది "బరి". ఈరోజు (మార్చి 28) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుకు టాలీవుడ్ డైరెక్టర్ యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు. ముహూర్తపు సన్నివేశానికి స్వయంగా క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఈ సందర్భంగానే 'ది వరల్డ్ ఆఫ్ బరి' మోషన్ పోస్టర్ పేరుతో చిత్ర బృందం ఓ వీడియో రిలీజ్ చేసింది. 'పండుగాడు బరిలోకి దిగాలంటే బీరు, బిర్యానీ డబ్బే కాదురా.. అవతల వాళ్లకు కూడా దమ్ము ఉండాలి' అనే డైలాగ్ తో కూడిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది. 2027 సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలనే లక్ష్యంగా ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరోవైపు ఈ కార్యక్రమం సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. బిజీ షెడ్యూల్‌లో కూడా బాబాయ్ పవన్ కల్యాణ్ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉందన్నారు. థాంక్యూ బాబాయ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలానే దర్శకుడు యదు వంశీ చేసిన కామెంట్స్ సైతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. వాస్తవికత, స్పోర్ట్స్ డ్రామాలు అనగానే అందరూ మలయాళ సినిమాల వైపు చూస్తుంటారని ప్రశ్నించగా.. మలయాళ సినిమాల గురించి ఇప్పుడు మనం మాట్లాడక్కర్లేదు. మా దగ్గర కంటెంట్ ఉంది, మేము తీసి చూపిస్తాం. మన కథలు, మన సంస్కృతి, మన విలువలు ప్రతిబింబించేలా సినిమాలు తీయగల సామర్థ్యం మాకుంది" అంటూ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications