Bigg Boss 9 : తొలిరోజే కంటెస్టెంట్లకు షాకిచ్చిన బిగ్ బాస్.. హౌస్ నుంచి బయటకు వెళ్లమంటూ
బిగ్ బాస్ సీజన్-9 ఆదివారం నాడు మొదలైంది. తొలిరోజే బిగ్ బాస్ హౌస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సీజన్‌లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో 9 మంది సెలబ్రెటీలు, 6 మంది సాధారణ ప్రజలు (కామనర్స్) ఉన్నారు. అగ్నిపరీక్ష పాస్ అయిన కామనర్స్ ఇంటి ఓనర్లుగా, సెలబ్రెటీలు అద్దెకు వచ్చిన వారిగా (టెనెంట్స్) బిగ్ బాస్ విభజించారు.
గార్డెన్ ఏరియాలో మాత్రమే ఉండాలన్న నిబంధనను ఉల్లంఘించి సెలబ్రెటీలు ఇంట్లోకి వచ్చారు. దీంతో ఆగ్రహించిన బిగ్ బాస్, హౌస్‌లో ఉన్న మొత్తం ఆహారాన్ని నిలిపివేశారు. దీనిపై కంటెస్టెంట్లలో చర్చ మొదలైంది. మాస్క్ మ్యాన్ హరీష్ మాట్లాడుతూ, "నన్ను తినొద్దు అంటే తినను, కానీ నోటి దగ్గర ముద్దను లాక్కోను" అని తన అభిప్రాయాన్ని బలంగా చెప్పాడు. దీంతో మిగతా కంటెస్టెంట్లు సెలబ్రెటీలను గార్డెన్ ఏరియాకు వెళ్లి ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఏమైనా పరిణామాలు ఎదురైతే తాము భరిస్తామని దమ్ము శ్రీజ సెలబ్రెటీలకు హామీ ఇచ్చింది.

అదే సమయంలో, ధరణి కామనర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. "మేము ఓనర్ల ప్రైవసీని డిస్ట్రబ్ చేయడం లేదు. కానీ వాళ్లు వచ్చి మమ్మల్ని డిస్ట్రబ్ చేస్తున్నారు. ఒక అమ్మాయి వచ్చి నా ముఖంపై రాసి వెళ్తోంది. ఇంకో అమ్మాయి వచ్చి తినిపిస్తోంది. ఏంటిది?" అని ప్రశ్నించాడు. దీంతో హౌస్‌లో తొలిరోజే ఉద్రిక్తత పెరిగింది.
ఈ పరిణామాలు చూస్తుంటే, మొదటి వారమే హౌస్‌లో ఓనర్లు, టెనెంట్ల మధ్య పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది. బిగ్ బాస్ చివరకు ఆహారాన్ని మళ్లీ ఇచ్చాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications