విడుదలకు ముందు 'గేమ్ ఛేంజర్'కు బిగ్ షాక్
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న తరుణం రానే వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన, టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ట్రైలర్‌ను చూస్తుంటే సినిమాలో దర్శకుడు శంకర్ మార్క్ కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది.
శంకర్ గత సినిమాల మాదిరిగానే అన్యాయాలపై పోరాడే హీరోగా రామ్ చరణ్ కనిపించబోతున్నారని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. రామ్ చరణ్ మాస్ అవతారంలో ఇరగదీశాడు. స్టూడెంట్, , పోలీస్ , ఐఏఎస్ ఆఫీసర్‌గా, రాజకీయ నాయకుడుగా, ఇలా విభిన్నపాత్రల్లో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.అయితే విడుదలకు ముందు సినిమాకు బిగ్ షాక్ తగిలింది.కర్ణాటకలో ఈ మూవీకి నిరసన సెగ తగిలింది. బెంగుళూరులో పలు చోట్ల గోడలకు అంటించిన సినిమా వాల్ పోస్టర్లపై కలర్ స్పే చల్లుతూ కొందరు కన్నడిగులు నిరసన తెలిపారు.

ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు.కన్నడలో కాకుండా కేవలం ఇంగ్లీష్‌లోనే పోస్టర్లు రిలీజ్ చేస్తుందటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.పైగా అక్కడ తెలుగులో కూడా సినిమాను రిలీజ్ చేయడాన్ని వారు తీవ్రం వ్యతిరేకిస్తున్నారు.ఇక సినిమాలో మెయిన్ విలన్‌గా ఎస్‌జె సూర్య కనిపించబోతున్నారు. ఇక తమన్ అందించిన బీజీఎమ్ ఆకట్టుకుంది. కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి, సముద్రఖని, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
'గేమ్ ఛేంజర్' అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ గత చిత్రం 'ఆచార్య' ఫ్లాప్ కావడంతో , 'గేమ్ ఛేంజర్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'గేమ్ ఛేంజర్' సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ లెక్కలన్నీ కూడా మార్చేస్తాడని మెగా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.రామ్ చరణ్ కెరీర్‌లోనే 'గేమ్ ఛేంజర్' భారీ హిట్‌గా నిలపలనే ఉద్దేశంతో దర్శకుడు శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాను తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. 'గేమ్ ఛేంజర్' సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.జనవరి 10వ తేదీన 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తర్వాత 'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ లెక్కలను ఎలా మారుస్తాడో చూడాలి.












Click it and Unblock the Notifications