బిగ్‌బాస్‌లో బిగ్ షాక్..మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఊహించని కంటెస్టెంట్ ఔట్...
బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఐదోవారం ఇంట్లో పరిస్థితి అనుకోని మలుపులు తిరుగుతోంది. నాలుగోవారంలో ఇంటి నుంచి సోనియా వెళ్లిపోగా, మిడ్‌వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ముందుగానే చెప్పాడు. అయితే, ఇప్పడు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ అందరీకి షాకిచ్చేలా ఉంది. రీసెంట్‌గా బిగ్ బాస్ 8 తెలుగు మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో కంటెస్టెంట్లకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
బిగ్ బాస్ తెలుగు 8 ఊహించని ట్విస్టులతో కొనసాగుతోంది. ఐదో వారం సాధారణ ఎలిమినేషన్‌తోపాటు మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుందని నాగార్జున ఆదివారం ఎపిసోడ్‌లో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఇంట్లో ఐదో వారం ఎలిమినేషన్‌లో భాగంగా సోమవారం నాడు నామినేషన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా నామినేషన్స్‌కు ఆరుగురు నామినేట్ అయ్యారు.
ఈ నామినేషన్స్‌లో నైనిక, నాగ మణికంఠ, విష్ణుప్రియ, నబీల్, ఆదిత్య ఓం, నిఖిల్ ఆరుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఈ వారం మిడ్ వీక్‌లో ఒకరు, వీకెండ్‌లో మరొకరు ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం చూస్తే నబీల్ టాప్ పోజిషన్‌లో ఉండగా, నిఖిల్ రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో నాగ మణికంఠ కొనసాగుతున్నాడు.
ఆ తర్వాతి స్థానాల్లో యాంకర్ విష్ణుప్రియ ఉన్నట్లు అధికారిక ఓటింగ్ పోల్స్ నుంచి వచ్చిన సమాచారం. ఇక, చివరి రెండు స్థానాలు ఆదిత్య ఓం, నైనిక ఉన్నారు.

అతడు ఇంటి నుంచి ఔట్..
దీంతో వీరిద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు మిడ్ వీక్‌లో ఎలిమినేట్ కాగా, మరొకరు వీకెండ్ ఎలిమినేషన్‌లో ఎలిమినేట్ అవుతారని సమాచారం. అందులో మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో నైనిక ఉండగా, వీకెండ్ ఎలిమినేషన్‌లో ఆదిత్య ఎలిమినేట్ కానున్నట్లు న్యూస్ తెగ వైరల్ అయ్యింది. కానీ, ఇంతలో అభిమానులకు బిగ్ షాక్ తగిలింది.
మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇక, ఈ ఎలిమినేషన్‌కు సంబంధించిన షూటింగ్ బుధవారం (అక్టోబర్ 2) జరిగింది. ఆదిత్య ఓం ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను నేటి ఎపిసోడ్‌లో చూపించనున్నట్లు సమాచారం. అయితే, అతి తక్కువ ఓటింగ్‌తో వీరిద్దరూ కాస్తా అటు ఇటుగా ఉన్నట్లు తెలుస్తోంది. నైనిక కంటే తక్కువ ఓట్లు రావడంతో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications