హీరోయిన్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన బిగ్ షాట్.. ఆ పని చేసినందుకేనా..?

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ఈ అమ్మడు విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. జాన్వీ కపూర్‌ను స్టార్ హీరోయిన్‌గా చూడాలని శ్రీదేవి కలలు కన్నారు. కానీ ఆ కోరిక తీరకుండానే ప్రమాదవశాత్తు ఆమె మరణించడం జరిగింది. జాన్వీ కపూర్ హిందీలో 2018లో వచ్చిన 'ధడక్' సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేదు. అయినప్పటికీ జాన్వీ కపూర్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా ఆమె ఫాలోయింగ్ గతంలో కంటే ఇప్పుడు మరింత పెరిగింది.

ఇదే సమయంలో జాన్వీ కపూర్‌కు తెలుగులో వరుస అవకాశాలు దక్కుతున్నాయి.ఎన్టీఆర్ 'దేవర'తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్ , తొలి సినిమాతోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 'దేవర-2'తో పాటు, రామ్ చరణ్ కొత్త సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది.

Big Shot gives a costly gift to Telugu star heroine

తన హాట్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. చీర కట్టిన, స్కార్ట్ వేసిన ఎందులో అయినా సరే జాన్వీ అందమే వేరు అన్నట్టుగా ఉంటుంది. ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్‌ కోసమే తన టైమ్‌‌ను అధికంగా కేటాయిస్తూ జాన్వీకపూర్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది.పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీ కెరీర్‌లో ఓ భాగమనే చెప్పాలి.

పైగా తన హాట్ నెస్ చూపిస్తూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే జాన్వీ కపూర్‌కు ఓ బిగ్ షాట్ నుంచి ఐదు కోట్ల విలువైన కారును గిఫ్ట్‌గా అందింది. ఈ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చింది మరెవరో కాదు.. బిర్లా వారసురాలు, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ కుమార్ మంగళం బిర్లా కూతురు అనన్య బిర్లా. జాన్వీ కపూర్‌ , అనన్య బిర్లా మంచి స్నేహితులు. ఏప్రిల్ 11, 2025న, అనన్య బిర్లా జాన్వీ కపూర్‌కు లంబోర్ఘిని గల్లార్డో స్పైడర్ కారును బహుమతిగా ఇచ్చింది. ఈ కారు విలువ దాదాపు రూ. 4 కోట్ల నుండి రూ. 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

ఈ కారును ఒక పెద్ద ఊదా రంగు గిఫ్ట్ బాక్స్‌లో ఉంచి, దానిపై "With love etc. Ananya Birla" అని రాసి ఉన్న ఒక ట్యాగ్‌తో జాన్వీ ఇంటికి పంపించారు.జాన్వీ కపూర్ అనన్య బిర్లా ప్రారంభించబోయే కొత్త మేకప్ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ బహుమతి ఆమెకు కృతజ్ఞతగా ఇచ్చారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+