తొలిరోజే బిగ్‌ ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్

తెలుగులో ద్విగజయంగా ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్, మరో సీజన్‌కు రెడీ అయింది. దీనిలో భాగంగానే ఈ ఆదివారం నుంచి బిగ్‌బాస్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. కొత్త సీజన్‌ కోసం అన్నపూర్ణ స్టూడియోలో వేస్తున్న భారీ సెట్‌ కూడా పూర్తి అయింది. ఈ సీజన్‌లో హోస్ట్‌‌‌ను మారుస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ , 8వ సీజన్‌లో కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. గత బిగ్‌బాస్ సీజన్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఫెయిల్ అయ్యాయి. హౌస్‌లోకి వచ్చిన ఆర్టిస్టులు పెద్దగా ఫేమస్ కాకపోవడం..బిగ్‌‌బాస్ ఆడించే గేమ్స్ ఆసక్తికరంగా లేకపోవడం ఇలా అన్ని కలిసి.. 'బిగ్‌ బాస్' షో ప్లాప్‌ అయ్యేలా చేశాయి.

దీంతో టీఆర్పీ రేటింగ్స్‌ సైతం భారీగా పడిపోవడంతో.. షో యాజమాన్యం .. 8వ సీజన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. దీనిలో భాగంగానే పలువురు సెలబ్రిటీలను షోకు తీసుకువచ్చేలా షో యాజమాన్యం ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకూ విడుదలైన ప్రోమోలు షోపై అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి. బిగ్‌‌బాస్ కొత్త సీజన్‌లో కంటెస్ట్‌ల ఎంపిక విషయంలో కూడా జాగ్రత్తలు వహించినట్టు సమాచారం. ఫేమస్ యాకర్ట్స్‌తో పాటు, కపుల్స్‌ను కూడా ఈసారి ఎంపిక చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక సారి జరగబోయే సీజన్‌లో టీవీ ఆర్టిస్టులతో పాటు, సినిమా వారిని కూడా అధిక సంఖ్యలో తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది.

Big twist on Bigg Boss season Telugu 8

తాజాగా విడుదల చేసిన బిగ్‌బాస్ ప్రోమో అంచనాలను పెంచేసింది. నేను మీ కళ్లల్లోకి చూడలేను.. ఎందుకంటే ఎక్కడ కొట్టుకుని పోతాననే భయం సార్ అంటూ ఓ కంటెస్టెంట్‌ వాయిస్ మాత్రమే వినిపించారు. అయితే అలా మాట్లాడింది ప్రముఖ యూట్యూబర్ బేబక్క అని తెలుస్తోంది.ఏంటి హౌస్‌లో ఎవరినైనా పార్టనర్‌ని వెతుక్కుంటున్నావా? అంటూ నాగార్జున సీరియల్ హీరో నిఖిల్‌ని అన్నాడు. నన్ను శత్రువుగా చూస్తే .. ఏకంగా బిగ్‌బాస్ టైటిల్ ఎత్తుకెళ్లిపోతా అని శేఖర్ బాషా అన్నాడు. నేను మీకు చెప్పినట్టే.. ఈ సీజన్లో సోలో ఏంట్రీ లేదు.. జంటగా మాత్రమే వెళ్లాలంటూ ఆడియెన్స్‌కి , కంటెస్టెంట్స్‌ బిగ్ షాక్ ఇచ్చారు.

ఈ ప్రోమో పై నెటిజెన్స్ ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. మీరు కపుల్స్ లాగే వెళ్లండి.. మీ ఇష్టమొచ్చినట్టు మీరు కథలు నడిపించుకోండి.. వాళ్ళకి కావాల్సిన కంటెంట్ వాళ్లకి ఇవ్వండని కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి బిగ్‌బాస్‌కు వచ్చే కంటెస్టెంట్ల లిస్ట్‌ను ఓసారి పరిశీలిస్తే..ఖయూమ్, ఇంద్రనీల్, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, యూట్యూబర్ బంచిక్ బబ్లు, ఆదిత్య ఓం, నిఖిల్ మిలిక్కల్, డ్యాన్సర్ నైనిక, రింగ్ రియాజ్, వర్షిణి సుందరరాజన్, రీతూ చౌదరి,విష్ణుప్రియ భీమినేని,శేఖర్ బాషా,మోడల్ రవితేజ, దర్శకుడు పరమేశ్వర్ ,అంజలి పవన్ ,సౌమ్యరావు,అభినవ్ నవీన్,అభిరామ్ వర్మ హీరోయిన్ విస్మయ శ్రీ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మొత్తం 18 మంది కంటెస్టెంట్లు ఈసారి‌లో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టనున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+