ప్రభాస్ 'రాజా సాబ్' సెన్సార్ రివ్యూ వచ్చేసింది..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న చిత్రం 'రాజా సాబ్'. ప్రభాస్ నటించిన తొలి హారర్ ఫ్యాంటెసీ కామెడీ డ్రామా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9 న ఈ మూవీ విడుదల కానుంది. జనవరి 8 నుంచే ప్రీమియర్స్ పడనున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే తాజాగా డార్లింగ్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్. 'రాజా సాబ్' సెన్సార్ తాజాగా పూర్తయింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బృందం U/A సర్టిఫికెట్ జారీ చేసిందని సమాచారం అందుతోంది. ఇక ఈ మూవీ రన్ టైమ్ సుమారు 183 నిమిషాలు అంటే 3 గంటల 3 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన చిత్రం 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఫ్యాన్స్ కోసం ఒకరోజు ముందుగానే అంటే జనవరి 8న దేశవ్యాప్తంగా పెయిడ్ ప్రీమియర్లు ఉంటాయని చిత్ర నిర్మాతలు ఇటీవల వెల్లడించారు.
ఇక ఈ మూవీ చూసిన సెన్సార్ సభ్యులు చెప్పిన టాక్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా నవ్వుకునేలా సాగుతుందని, ప్రభాస్ మార్క్ కామెడీ టైమింగ్, హీరోయిజంతో సరదాగా సాగిపోతుంది అట. మధ్యలో కొన్ని హారర్ ఎలిమెంట్స్ అభిమానులను థ్రిల్ కి గురి చేస్తుందని టాక్.
ఇక ఇంటర్వెల్ లో భారీ ట్విస్ట్ ఉంటుందని తెలుస్తోంది. అలా ఫస్ట్ ఆఫ్ కామెడీ సన్నివేశాలు, హారర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఇక సెకండాఫ్ స్టార్టింగ్ నుంచే గ్రిప్పింగ్ గా స్టోరీ ఉంటుందని.. మధ్యలో కాస్త స్లో అవుతుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ప్రభాస్ పవర్ ఫుల్ యాక్టింగ్, హారర్ ఎలిమెంట్స్, కామెడీ సీన్స్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కీలకమైన పాత్రతో మూవీ సూపర్ హిట్ అయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు నెట్టింట కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి రివ్యూ కావాలంటే జనవరి 8 వరకు ఆగాల్సిందే.

ఇక ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటించారు. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు.
-
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications