Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్‌లో ఎవరి గేమ్ బెస్ట్? సెలబ్రిటీలకు ఎదురుదెబ్బ తప్పదా?
Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం సెలబ్రిటీలు, అగ్నిపరీక్ష కంటెస్టెంట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. అయితే సరైన ఫీడ్‌బ్యాక్ అందకపోవడం వల్ల సెలబ్రిటీలు తమ ఆటను తామే అనవసరంగా పాడు చేసుకుంటున్నారు. హోస్ట్ నాగార్జున వీకెండ్‌లో సరైన ఇన్‌పుట్స్ ఇవ్వకపోగా.. ఎక్కువగా అగ్నిపరీక్ష కంటెస్టెంట్లను మందలించడంపైనే దృష్టి పెట్టడంతో సెలబ్రిటీలు తాము చాలా గొప్పగా ఆడుతున్నామని అభద్రతాభావం లేకుండా భ్రమపడుతున్నారు. తమ ఆటను ఎవరూ ఆపలేరన్న అతివిశ్వాసంతో వారు ముందుకు సాగుతున్నారు.
నిజానికి బయట మాత్రం అగ్నిపరీక్ష కంటెస్టెంట్ల పట్ల ప్రేక్షకుల్లో సానుభూతి రోజురోజుకూ పెరుగుతోంది. నామినేషన్ల ప్రక్రియలో సెలబ్రిటీలంతా ఒక గ్రూప్‌గా ఏకమై, అగ్నిపరీక్ష కంటెస్టెంట్లందరినీ ఈ వారం కావాలనే టార్గెట్ చేసి నామినేట్ చేశారు. తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు వారు ఈ వ్యూహం పన్నారు. ఈ క్రమంలో సెలబ్రిటీలు, ముఖ్యంగా సుధీర్ అత్యంత ఆక్రమణాత్మక ధోరణితో వ్యవహరించడమే కాకుండా ఎలాంటి లాజిక్ లేకుండా రోహిత్‌ను తీవ్రంగా అవమానించారు. తెరవెనుక ఇతర సెలబ్రిటీల నుంచి సుధీర్‌కు మద్దతు లభించడం గమనార్హం.

రెండు రోజుల పాటు జరిగిన ఈ నామినేషన్ల ప్రక్రియ ప్రేక్షకులకు ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించలేదు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఆడాల్సింది పోయి, ఎలాంటి అవసరం లేకపోయినా గ్రూప్ గేమ్‌ను తెరపైకి తెచ్చారు. బిగ్‌బాస్ హౌస్‌ను విభిన్న వర్గాలుగా విభజించినప్పటికీ.. సెలబ్రిటీలు ఒక వర్గంగా తమ సొంత ఆట ఆడుతుంటే.. అగ్ని పరీక్ష కంటెస్టెంట్లు మాత్రం వేరుగా పోరాడుతున్నారు.
మరోవైపు సెలబ్రిటీల ఈ గ్రూప్ తంతు, వారి దూకుడు వల్ల కామన్ మ్యాన్ కంటెస్టెంట్లకు మరింత సానుభూతి లభిస్తోంది. కనీసం రాబోయే వీకెండ్ ఎపిసోడ్‌లోనైనా హోస్ట్ నాగార్జున సరైన, నిష్పాక్షికమైన ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప్రేక్షకుల సింపతి మొత్తం కామన్ మ్యాన్ వైపునకు మళ్లి సెలబ్రిటీలు హౌస్ లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.














Click it and Unblock the Notifications
