ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. బిగ్ బాస్- 2025 క్యాన్సిల్..?

దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో నిర్వహిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఈ షోకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రియాల్టీ షో హిందీతోపాటు కన్నడ, బెంగాలీ, తమిళం, తెలుగు, మరాఠీ, మలయాళం భాషల్లో ప్రసారం అవుతుంది. అయితే తెలుగులో ఈ షోకు ప్రస్తుతం నాగార్జున హోస్ట్ గా ఉన్నారు. ఇక హిందీలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. గత 8 సీజన్లలో ఆయన విజయవంతంగా షోను నడిపించారు.

అయితే షాకింగ్ విషయం ఏంటంటే బిగ్ బాస్- 2025 హిందీ సీజన్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. అనేక ఏళ్ల నుంచి దీనిని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కాగా, తాజాగా 2025లో ఈ షో జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంవత్సరం వరకు విరామం ఇచ్చి మళ్లీ వచ్చే సంవత్సరం నుంచి కొనసాగించాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం.

Bigg Boss 2025 Reportedly Canceled

బిగ్ బాస్- 2025 హిందీ సీజన్ క్యాన్సిల్ అయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే ఈ షో క్యాన్సిల్ కావడానికి కారణాలను అన్వేషిస్తే.. బనిజయ్ ఆసియా, ఎండేమోల్ సంస్థలతో కలర్స్ ఛానల్​ కు ఉన్న విబేధాలు బిగ్ బాస్ వాయిదా పడడానికి కారణమని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. వీరిద్దరి మధ్య 2 నెలల క్రితం వివాదం చెలరేగింది.. తాజాగా ఈ రియాల్టీ షో నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక బిగ్ బాస్ రియాల్టీ షో ఓ సంచలనం. ఇండియన్ టీవీ చరిత్రలో అత్యధికంగా వీక్షించిన షోగా బిగ్ బాస్ నిలిచింది. ​ ఈ షో వల్ల అనేక మంది యంగ్ నటుల కెరీర్ మారిపోయింది. 2006 ప్రారంభమైన మొదటి సీజన్‌కు హర్షద్ వార్సీ హోస్ట్‌ గా ఉన్నారు. అనంతరం రెండో సీజన్‌ లో శిల్పా శెట్టి, మూడో సీజన్‌ లో అమితాబ్ బచ్చన్ హోస్ట్‌ గా వ్యవహరించారు. సీజన్ 4 నుంచి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా కొనసాగుతున్నారు. ఇక తెలుగులోనూ బిగ్ బాస్ సంచలనం సృష్టించింది. ఇప్పటికే 8 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్​ 9 2025 ఆగస్టులో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కింగ్ నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+