హద్దులు దాటిన బిగ్‌బాస్..మహిళ కంటెస్ట్ ప్రైవేట్ పార్ట్‌పై చేయి వేసిన తొటి కంటెస్ట్
బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్ అంచనాలకు తగ్గట్టుగానే సాగుతుంది. తాజా సీజన్లో పెద్దగా పేరున్న సెలబ్రిటీలను తీసుకురానపన్పటికీ.. ఈసారి ఉల్టా,ఫల్టా అంటూ బిగ్‌బాస్ ఆడించే గేమ్ సరికొత్తగా ఉండటంతో.. 7వ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ తాజా సీజన్ నాల్గోవారంలోకి అడుగు పెట్టింది.
నాల్గోవారం కూడా ఆసక్తికరంగా సాగుతుంది. కెప్టెన్సీ రేస్‌కి సంబంధించిన టాస్క్ ప్రస్తుతం హౌస్‌లో జరుగుతుంది. హౌస్‌మెట్స్ ప్రస్తుతం బిగ్‌బాస్ ఇచ్చిన గేమ్‌ను ఆడుతున్నారు.. 'దొరికితే దొంగ దొరక్కపోతే దొర ' నా స్నేహితుడు చాలా కాలంగా నా దగ్గర నుంచి కొన్ని వస్తువులు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదు .వాటిని ఎవరైతే ఎక్కువుగా తిరిగి దొంగిలిస్తారో..వారు కెప్టెన్సీ రేస్‌లో ఉంటారని చెప్పడంతో...గేమ్ ఆసక్తికరంగా సాగుతుంది. కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్లందరు కూడా తమ శక్తికి మించి ఆడటం కనిపించింది.

అయితే బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ ఆడే సమయంలో ఓ మహిళ కంటెస్ట్ ప్రైవేట్ పార్ట్ పై తొటి కంటెస్ట్ చేయి వేయడం వివాస్పదంగా మారింది. టాస్క్‌లో భాగంగా దొంగతనం చేసుకొచ్చిన వస్తువులతో గార్డెన్ ఏరియాలో కంటెస్టెంట్లందరు వరుసగా నిలుచున్నారు.ఆ సమయంలో తేజా దగ్గర ఉన్న ఫోన్ శోభా శెట్టి లాక్కుంది. దీంతో కోపం వచ్చిన ప్రిన్స్ యావర్ ఆమె దగ్గర వస్తువులు లాక్కునే ప్రయత్నం చేశాడు.

ఆ సమయంలో ఇద్దరి మధ్య చినపాటి ఘర్షణ జరిగింది. నీ చేయి నా ప్రైవేట్ పార్ట్ వద్ద ఉందని చెప్పిన శోభా , యావర్ చేస్తున్న దానిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ యావర్ ఏమాత్రం వెనక్కి మాత్రం తగ్గలేదు. పరిస్థితి చేయి దాటిపోతుందని గమనించిన బిగ్‌బాస్ గేమ్‌ని ఆపేశారు. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ అసలు స్వరూపంను మార్చే స్వేచ్ఛ మీకు ఎంత మాత్రం లేదని తెలిపడం జరిగింది. శోభా శెట్టి ప్రైవేట్ పార్ట్‌పై యావర్ చేయి వేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై హోస్ట్ నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications