బిగ్‌బాస్ 8 ప్రోమో వచ్చేసింది.. తొలిరోజే ఎలిమినేషన్.. కంటెస్టెంట్స్‌ని టెన్షన్ పెట్టిన స్టార్ డైరెక్టర్..
తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ సీజన్ 8 నేడు రానుంది. తాజాగా బిగ్ బాస్ 8 ప్రోమో వచ్చేసింది. గత ఏడు సీజన్‌లా మాదిరి కాకుండా ఈసారి ఊహకందని ట్విస్టులే ఈ ప్రోమోలో కనిపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ల పేర్లు బయటపడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రొమోలో మాత్రం హోస్‌మెట్స్ ముఖాలు కనిపించకుండా చేశారు. అయితే, వాళ్ల వాయిస్‌లను బట్టి ఎవరా? అనేది అభిమానులు గ్రహించేస్తున్నారు...
బిగ్‌బాస్ ప్రోమో 8లో ముందుగా గృహప్రవేశ ముహుర్తం ఈ రోజు రాత్రి 7గంటలకు అనే హెడ్‌లైన్‌తో ప్రోమో మొదలవుతుంది. ఇక, అందులో నేను మీ కళ్లల్లోకి చూడలేను.. ఎందుకంటే ఎక్కడ కొట్టుకుని పోతాననే భయం సార్ అనే వాయిస్ వినిపిస్తోంది. ఆమె మాటలను బట్టి బేబక్క అని మనకు అర్థం అవుతుంది. మరో కంటెస్టెంట్‌తో హౌస్‌లో ఎవర్నైనా పార్టనర్‌ని వెతుక్కుంటున్నావా? అంటూ నాగార్జున అడుగుతారు. ఆ కంటెస్టెంట్ సీరియల్ నటుడు నిఖిల్ అని అర్థమవుతుంది.

మరో మేల్ కంటెస్టెంట్ నన్ను శత్రువుగా చూస్తే మాత్రం.. బిగ్ బాస్ టైటిల్ పట్టుకునిపోతానంటూ వాయిస్ వినిపిస్తుంది. అతను ఎవరో కాదు..శేఖర్ బాషా... అయితే, గత ఏడు సీజన్ల మాదిరిగా ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి సోలో ఏంట్రీ లేదు... జంటగా మాత్రమే లోపలికి ప్రవేశం ఉందంటూ నాగార్జున చెబుతారు. అన్నట్టుగానే ఇద్దరిద్దర్ని జంటలుగా హౌస్‌లోకి పంపించడం మనం ప్రోమోలో చూస్తాం. ఈసారి బిగ్‌బాస్ గ్రాండ్ లాంచింగ్ ముగ్గురు గెస్ట్‌లు రాబోతున్నట్లు ముందునుంచే ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగానే ప్రొమోలో కూడా ముందుగా నేచురల్ స్టార్ నాని కనిపిస్తారు.
తొలిరోజే ఎలిమినేషన్..
నానితోపాటు రానా, నటి నివేదా థామస్, ప్రియాంక మోహన్‌లు కూడా కనిపిస్తారు. అయితే, వీరూ కేవలం హౌస్‌కి అతిథులుగా రావడమే కాకుండా బిగ్‌బాస్ హౌస్‌లోకి కూడా వెళ్తారు. హౌస్‌మేట్స్‌తో ఈ స్టార్స్ ముచ్చటించడం కూడా చూపిస్తారు. వీరితోపాటు స్టార్ డైరెక్టర్ అనిల్‌రావిపూడి కూడా హౌస్‌లోకి ప్రత్యక్షమవుతారు. అయితే, ఆయన మొదటిరోజే హౌస్‌లో ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడతారు. మాట్లాడ్డమే కాదు.. ఫస్ట్‌వీక్‌లోనే ఎలిమినేషన్ అని హౌస్‌మేట్స్‌ని టెన్షన్ పెడతారు. ఇప్పుడు నేను ఒకర్ని హౌస్ నుంచి బయటకు తీసుకుని వెళ్తున్నాను.. లక్కీ డ్రాలో వాళ్ల ప్లేస్ ఇంకొకర్ని స్వాప్ చేసి లోపలికి పంపిస్తాం అని అనిల్ రావీపూడి చెప్తాడు.. అయితే, మొదటి రోజే ఎలిమినేషన్ ఏంటీ.. అని ప్రేక్షకుల్లో టెన్షన్ మొదలయ్యింది.. ఇక, ఈ సీజన్‌లో ఎన్ని గొడవలు, లవ్‌స్టోరీలు చూడాల్సివస్తోంది.. వెయిట్ అండ్ వాచ్..












Click it and Unblock the Notifications