ఈ వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ 8వ సీజన్ అనుకున్నట్టుగానే ట్విస్ట్‌లతో సాగుతోంది. గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ ముందుకు వెళ్తోంది. ఈసారి ప్రోమోలతోనే అదరగొట్టిన బిగ్‌బాస్ , దానికి మించిన కంటెంట్‌తో ఆకట్టుకుంటున్నారు.అయితే ఈ సీజన్‌లో పెద్దగా పేరున్న ఆర్టిస్టులు లేకపోవడంతో షో యామమాన్యంపై అభిమానులు పెదవి విరిచారు. దీంతో ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీతో పాత కంటెస్టెంట్‌లను హౌస్‌లోకి తీసుకువచ్చి బిగ్‌బాస్ బిగ్ ట్విస్టే ఇచ్చాడు.
ఇక ఈ వారం హోస్ నుంచి బయటకు రావడానికి నామినేట్ అయిన ఇంటి సభ్యులను ఓసారి గమనిస్తే..గౌతమ్‌తో పాటు నిఖిల్, ప్రేరణ, యష్మి, విష్ణుప్రియ, పృథ్వీ, హరితేజ ఉన్నారు. వీరిలో యష్మి, పృథ్వీ, హరితేజ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీక్ పృథ్వీ ఎలిమినేట్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నామినేషన్స్‌లో ఉన్న వారిలో పృథ్వీకే తక్కువగా ఓట్లు పడ్డట్లు సమాచారం. నబీల్‌తోపాటు ఇతర కంటెస్టెంట్స్‌తో పృథ్వీ పడిన గొడవలు అతడికి మైనస్‌గా మారినట్లు చెబుతోన్నారు.

ఇదే సమయంతో హరితేజ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది. హరితేజ ఈ సీజన్‌లో తన మార్క్ చూపించడంలో విఫలం అయ్యారనే చెప్పాలి. గెలుపు కోసం ఎంతకైనా తెగించి.. స్వార్థంలో నిండిపోయిన మనస్థత్వంతో ఈ సీజన్‌లోకి ఎంటర్ అయ్యింది హరితేజ. అందుకే తను ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. పైగా గత రెండు వారాలు నుండి ఇతర కంటెస్టెంట్స్‌తో హరితేజకు గొడవలు ఎక్కువయ్యాయి. అలా కూడా తనపై నెగిటివిటీ పెరిగిపోయింది. ఈ కారణంగా ఆమె కూడా ఓట్లు సాధించడంలో వెనుకపడ్డారని తెలుస్తోంది.
వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం హోస్ నుంచి బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో గంగవ్వ.. పలు అనారోగ్య కారణాలతో హౌస్ నుంచి బయటకు రానుందని తెలుస్తోంది. నామినేషన్ లేకుండానే గంగవ్వ బిగ్‌బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోబోతున్నట్లు చెబుతోన్నారు.గతంలో కూడా ఆమె అనారోగ్యం కారణంగానే షో మధ్యలోనే వెళ్లిపోయింది. తాజా సీజన్‌లో కూడా ఆమె ఇదే కారణంతో బిగ్‌బాస్ నుంచి బయటకు రానుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ గట్టి షాకే ఇచ్చాడని అర్థం అవుతోంది. మరి గంగవ్వతో పాటు, ఎవరూ హోస్ నుంచి బయటకు రానున్నారో చూడాలి.












Click it and Unblock the Notifications