"బిగ్ బాస్ 9 తెలుగు" విన్నర్ ఎవరో చెప్పేసిన సీజన్ 8 విజేత..?

బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో "బిగ్ బాస్". ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. 9వ సీజన్‌ కూడా ప్రేక్షకులకు వినోదాలను పంచింది. వచ్చే ఆదివారంతో ఈ సీజన్‌కు అధికారికంగా ఎండ్ కార్డ్ పడనుంది. దాదాపు 15 వారాల పాటు ప్రేక్షకులను అలరించిన ఈ రియాలిటీ షో చివరి వారానికి చేరుకుంది. 14వ వారంలో డబుల్ ఎలిమినేషన్ అవ్వగా.. సుమన్ శెట్టితో పాటు భరణి కూడా ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం టాప్ ఫైవ్ కంటెస్టెంట్లుగా ఇమ్మానుయేల్, పవన్, కళ్యాణ్, సంజన, తనూజ ఉన్న సంగతి తెలిసిందే.

ఇక ఇప్పటికే గ్రాండ్ ఫినాలే కోసం ఇప్పటికే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవ్వగా .. తమ ఫెవరేట్ కంటెస్టెంట్స్ కోసం వారి మిత్రులు, మాజీ కంటెస్టెంట్స్ అండగా నిలుస్తూ ఓటు వేయాలని అభ్యర్ధిస్తున్నారు. ఈ ఆదివారం సాయంత్రం బిగ్ బాస్ 9 ఫినాలే ఎంతో ఘనంగా జరగబోతుంది. దీంతో టైటిల్ గెలుచుకునేది ఎవరా అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైనప్పటి నుంచి తనూజ, లేదా ఇమ్మానుయేల్ విన్నర్ అవుతారని అందరూ భావించారు.

bigg-boss-8-winner-comments-about-season-9-telugu-title-winner

అయితే కామన్ మాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల.. మొదటి నుంచి కూడా ఓటింగ్ లో టాప్ లో దూసుకుపోతున్నాడు. మధ్యలో అమ్మాయిల విషయంలో కొంచెం ట్రోలింగ్ ఎదుర్కొన్న కానీ.. మళ్లీ టాస్కులలో, బిహేవియర్ తో మళ్లీ గట్టిగానే కం బ్యాక్ ఇచ్చినట్టు చెబుతున్నారు. దీంతో కళ్యాణ్ విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్.. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అవుతారో అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

నిఖిల్ ఏమన్నాడంటే..

బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్ ఇమ్మానుయేల్ లేదా కళ్యాణ్ ఇద్దరిలో ఎవరో ఒకరు విన్నర్ గా నిలుస్తారని వ్యాఖ్యానించారు. సదరు వీడియోలో నిఖిల్ తో పాటు, టేస్టీ తేజ కూడా ఉన్నారు. తేజ అడిగిన ప్రశ్నకు నిఖిల్ సమాధానం ఇవ్వడం గమనించవచ్చు. ఇక ఈ సీజన్ విన్నర్ కు 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నట్లు నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి బిగ్ బాస్ 7 లాగే ఈ సీజన్లో కూడా కామన్ మ్యాన్ విజేతగా నిలుస్తారా లేదా ఇమ్మానుయేల్, తనూజ లలో ఒకరు టైటిల్ గెలుస్తారో అని తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+