బిగ్ బాస్ హౌస్ నుంచి ఆ బ్యూటీ అవుట్..? ఇది అసలు ఊహించలేదే..!
బిగ్‌బాస్ సీజన్ 9 ప్రారంభమైంది మొదలు మొదటి ఎలిమినేషన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ అనే థీమ్‌తో మొదలైన ఈ సీజన్‌లో తొలి వారం ఎవరు ఇంటికి వెళ్తారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ వారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారిలో ఎనిమిది మంది సెలబ్రిటీలు కాగా, ఒకరు కామనర్.
నామినేట్ అయిన వారిలో సంజనా గల్రానీ, రీతూ చౌదరి, శ్రష్ఠి వర్మ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, తనూజ, ఫ్లోరా సైనీ, రాము రాథోడ్, డీమన్ పవన్ ఉన్నారు. బిగ్‌బాస్ ఇచ్చిన ప్రత్యేకమైన 'సుత్తి' టాస్క్ ద్వారా ఈ నామినేషన్ ప్రక్రియ జరిగింది.

ఓటింగ్ ఫలితాలు, డేంజర్ జోన్‌లోని కంటెస్టెంట్స్
బుధవారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు జరిగిన ఓటింగ్‌లో అఫీషియల్ ఫలితాలు ఇంకా బయటకు రానప్పటికీ, అనధికారిక లెక్కలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం, నామినేట్ అయిన వారిలో తనూజ అత్యధిక ఓట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, సంజనా గల్రానీ, డీమన్ పవన్, రాము రాథోడ్ ఉన్నారు.
అయితే, డేంజర్ జోన్‌లో ఉన్నది ఇద్దరు మహిళా కంటెస్టెంట్స్ - ఫ్లోరా సైనీ మరియు శ్రష్ఠి వర్మ. ఈ ఇద్దరికీ చాలా తక్కువ ఓట్ల తేడా ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లోరా సైనీ ఈ వారంలో సంజనతో గొడవ తప్ప పెద్దగా యాక్టివ్ గా లేదు. అలాగే, తెలుగు మాట్లాడటంలో ఆమె ఇబ్బంది పడటం కూడా ఓట్లను ప్రభావితం చేసి ఉండొచ్చు. మరోవైపు, శ్రష్ఠి వర్మ కూడా అంతగా యాక్టివ్ గా కనిపించలేదు.
శ్రష్ఠి వర్మ ఎలిమినేట్?
అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం ఫ్లోరా సైనీ మరియు శ్రష్ఠి వర్మలలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే, సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రష్ఠి వర్మ. ఈ వారం శ్రష్ఠి వర్మనే ఇంటి నుంచి బయటకు వెళ్తారనే వార్త వైరల్ అవుతోంది. ఈ ఊహాగానాలలో నిజం ఎంత ఉందో తెలియాలంటే బిగ్‌బాస్ ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే. మొదటి ఎలిమినేషన్ నుంచే బిగ్‌బాస్ హౌస్ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications