Bigg Boss 9: ఈ వారం డబల్ ఎలిమినేషన్.. షో నుంచి వారిద్దరూ అవుట్

ఆ తర్వాత కామనర్స్‌పై వచ్చిన తీవ్రమైన నెగిటివిటీ కారణంగా, ప్రేక్షకులు వారిని ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేసుకుంటూ రావడం వల్ల ఫ్లోరా సేవ్ అవుతూ వచ్చింది. అయితే, ఈ వారం మాత్రం ఆమె ఎలిమినేట్ అయ్యారు. హీరోయిన్ కేటగిరీలో వచ్చిన కంటెస్టెంట్ కావడం వల్ల ఆమెకు రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్‌లో ఇచ్చినట్లు సమాచారం. వారానికి రూ. 2.5 లక్షల చొప్పున బిగ్ బాస్ టీం ఆమెతో అగ్రిమెంట్ చేసుకున్నారట. 5 వారాలు హౌస్‌లో ఉన్నందుకు గాను, ఆమె రూ. 12.50 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.
పెద్దగా కంటెంట్ ఇవ్వడం లేదు కాబట్టి ఆమెను పంపేస్తారని అంతా ఊహించినట్టే జరిగింది. అయితే, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగిందని, ఫ్లోరా షైనీతో పాటు మరో కంటెస్టెంట్ శ్రీజ దమ్ము కూడా ఎలిమినేట్ అయి షో నుంచి బయటకు వచ్చేశారు. 'అగ్నిపరీక్ష' షో ద్వారా వేలమంది సామాన్యుల మధ్య కంటెస్టెంట్‌గా ఎంపికై హౌస్‌లోకి అడుగుపెట్టడం శ్రీజకు పెద్ద విజయం లాంటిదే.
ఫ్లోరా ఎలిమినేషన్ అందరూ ఊహించిందే అయినప్పటికీ, శ్రీజ ఎలిమినేషన్ మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. ఆమె కచ్చితంగా టాప్ 5 వరకు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ బ్యాడ్ లక్ ఆమెను వెంటాడింది. ఈ వారం డేంజర్ జోన్‌లో ఉన్న రీతూ చౌదరి సేవ్ అవ్వగా, శ్రీజ దమ్ము ఎలిమినేట్ అయ్యారు. సామాన్యుల విభాగంలో బలమైన కంటెస్టెంట్‌గా నిలబడుతుందని భావించిన శ్రీజ ఎలిమినేషన్ ప్రేక్షకులకు పెద్ద షాక్‌గా మారింది. ఈ డబుల్ ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ హౌస్‌లో గేమ్ మరింత రసవత్తరంగా మారనుంది.












Click it and Unblock the Notifications