మా అక్కను పెళ్లి చేసుకో..నేను ఫ్రీగా వస్తా.. యంగ్ హీరోకు నటి బంపర్ ఆఫర్

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్... విభిన్నమైన కథలతో, ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 'గూఢచారి 2' మరియు 'డెకాయిట్' వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శేష్, తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే ప్రముఖ డాన్స్ షో 'ఢీ'కి అతిథిగా హాజరయ్యారు. అయితే, ఈ షోలో బిగ్ బాస్ ఫేమ్ అశ్వినితో ఆయన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అడవి శేష్‌ను చూడగానే అశ్విని ఆశ్చర్యానికి గురైంది. తన అక్కకు శేష్ అంటే ఎంత ఇష్టమో చెప్పింది. "మా అక్కకు మీరంటే చాలా ఇష్టం" అని అశ్విని చెప్పగానే, శేష్ కూడా చిరునవ్వుతో "నాకు మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం" అని బదులిచ్చారు. ఈ సరదా సంభాషణ ఇలా కొనసాగుతుండగానే, అశ్విని ఊహించని షాక్ ఇచ్చింది. "మా అక్కను పెళ్లి చేసుకున్నారనుకోండి... మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ వస్తుంది" అని అనడంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు.

Bigg Boss actress Ashwini comments on Adivi Sesh go viral

అశ్విని తన మాటలను కొనసాగిస్తూ.. అక్కను పెళ్లి చేసుకుంటే నేనూ వస్తానని చెప్పగానే, అడవి శేష్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. అశ్విని "ఎలా వస్తాననేది కూడా చెప్తాను అనగానే, అక్కడున్న జడ్జి, కమెడియన్ హైపర్ ఆది వెంటనే అందుకుని, శేష్ మూవీలో కంటే నీ దగ్గరే ఎక్కువ సస్పెన్స్ ఉందిగా అని అనడంతో అంతా నవ్వుకున్నారు. ఈ సస్పెన్స్‌తోనే ప్రోమో ముగిసింది.

ఈ ప్రోమో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది ఫ్యామిలీ షోలా లేదు, ఆమె అసలు ఆడపిల్లలా మాట్లాడుతుందా? వంటి కామెంట్లు వెల్లువెత్తాయి. ఒక టీవీ షోలో ఒక నటి ఇంత డైరెక్ట్‌గా, అది కూడా ఒక హీరో పెళ్లి గురించి మాట్లాడటంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం, ఇదంతా కేవలం టీఆర్పీల కోసమే, షోలో ఉత్సాహం నింపడం కోసమే చేసిన ఒక ప్రయత్నంగా కొట్టిపారేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+