దొంగగా మారిన బిగ్‌బాస్ నటి
అరియనా పరిచయం అక్కర్లేని పేరు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్య్వూ చేసి ఒక్కసారిగా లైఫ్ లైన్‌లోకి వచ్చింది అరియనా గ్లోరీ. ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూతో అరియనా గ్లోరీ కెరీర్ మారిపోయింది. సోషల్ మీడియాలో అరియనా క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఎతంలా అంటే .. బిగ్‌బాస్‌కు ఎంపిక చేసేంతలా అరియనా ఫాలోయింగ్ పెరిగిపోయింది.
బిగ్‌బాస్‌కు సెలెక్ట్ అయినా అరియనా గ్లోరీ టాప్ 5లో నిలిచి సంచలనంగా సృష్టించింది. బిగ్‌బాస్ షోతో అరియనా మంచి పాపులారిటీ రాబట్టింది. బిగ్‌బాస్ తరువాత అరియనాకు పలు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఆర్టిస్ట్‌గా మారిపోయింది. గతంలో సన్నగా కనిపించిన అరియానా..ఇప్పుడు బొద్దుగా మారి చబ్బీగా కనిపిస్తోంది.

ప్రస్తుతం పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది ఈ బిగ్‌బాస్ బ్యూటీ. ఆ మధ్య డ్యాన్స్ మాస్టర్ పండుతో అరియానా రిలేషన్‌లో ఉందని వార్తలు వినిపించాయి. ఇక సోషల్ మీడియాలో అమ్మడును ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా అధికంగా ఉంది.సోషల్ మీడియాలో అరియానా తన షోలకు సంబంధించిన అప్టేట్స్‌తో పాటు , వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా అమ్మడు ఓ దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్ జెస్సీతో కలిసి ఓ ఈవెంట్‌కు వెళ్లింది అరియానా.

ఆ పార్టీ జరిగిన కొద్దిదూరంలోనే ఓ తోట ఉంది. అయితే ఆ తోటలో పాలకూర వేయడంతో దాన్ని దొంగలించడానికి వీరిద్దరు కలిసి వెళ్లారు. జెస్సీ ఇది వీడియో తీస్తుండగా అరియనా దొంగతనం చేసింది.ఇది పాలకూరనో చుక్కకూరనో తెలియడం లేదు చీకటిగా ఉంది నాకు దొంగతనం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉందని అరియానా అంటుంటే...ఒక కట్ట రూ. 10 రూపాయిలు వస్తుందని చెప్పగా.. డబ్బు ఇక్కడ ముఖ్యం కాదు దొంగతనం చేయడంలో త్రిల్‌గా ఉంటుందంటూ అరియానా పాలకూర మొత్తాన్ని దొంగతనం చేశారు.
ఈ వీడియోను అరియానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదేం పాడు అలవాటు అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. దొంగతనం చేయాలనే కంగారులో ప్యాంటు వేసుకోవడం కూడా మర్చిపోయావు అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అరియానా దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications