త్వరగా రారా బాబు..రాత్రి నిద్ర పట్టడం లేదు ..బిగ్‌బాస్ నటి హాట్ కామెంట్స్

నటి అశ్విని శ్రీ అంటే పెద్దగా ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు కానీ.. బిగ్‌బాస్ అశ్విని శ్రీ అంటే మాత్రం ఠక్కున గుర్తుపడతారు. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రవితేజ వంటి స్టార్ల సినిమాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదు.కానీ తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ అశ్విని శ్రీ కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేసింది. ఈ షోతో అశ్విని శ్రీ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది.అశ్విని శ్రీ బిగ్‌బాస్ షోలో ఉన్నన్నీ రోజులు అభిమానులకు కనుల పండగే అన్నట్టుగా ఉండేది. హౌస్‌లో హాట్ హాట్‌గా కనిపించి అభిమానులను అలరించింది. ఇక కీలక ఫైనల్ ముందు సెల్ఫ్ నామినేషన్ చేసుకుని బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయి అభిమానులను నిరాశపరిచింది.

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టకముందు హీరో అల్లు అర్జున్ హైట్ గురించి ఓ ఇంటర్య్వూలో మాట్లాడి సంచలనం సృష్టించింది. ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో అశ్విని శ్రీ మాట్లాడుతూ..తెలుగు టాప్ హీరోలందరితో ఐటం సాంగ్స్ చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. అయితే అల్లు అర్జున్ నా పక్కన చేయాలంటే స్టాండ్ వేసుకోవాల్సి వస్తుందని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక అశ్విని సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన కెరీర్ విషయాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.

bigg boss Ashwini Sri s comments about her future husband

తాజగా ఈ అమ్మడు కాబోయే భర్త గురించి కాస్త బోల్డ్‌గానే స్పందించింది.ఎలాంటి భర్త కావాలో..అతనిలో క్వాలిటీస్ ఏం ఉండాలో ఈ ఇంటర్య్వలో చెప్పుకొచ్చింది. నా లైఫ్‌లో కరెక్ట్ పర్సన్ ఇప్పటి వరకూ ఎదురుకాలేదని అశ్విని తెలిపింది అలాంటి వ్యక్తి దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. అలాంటివాడి కోసమే ఎదురు చూస్తున్నాను.ఎక్కడ ఉన్నావ్? త్వరగా రారా బాబు.వాడిని చేసుకోవడానికి రెడీగా ఉన్నాను.వాడు లేక నాకు నిద్ర పట్టడం లేదని బోల్డ్‌గానే కామెంట్ చేసింది.ఇండస్ట్రీ వాడు అయితే ఎప్పుడు బిజీగానే ఉంటారు ఇక నన్నేం చూసుకుంటారు అందుకే ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి కావాలని తాను మాత్రం ఇండస్ట్రీలోనే కొనసాగుతానని తెలిపారు. కాబోయే భర్త గురించి అశ్విని శ్రీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+