అడ్డంగా దొరికిపోయిన అషురెడ్డి
అషురెడ్డి గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. హీరోయిన్ సమంత పోలికలు ఉండటంతో అందరూ కూడా జూనియర్ సమంత అని, సమంత చెల్లెలు అంటూ ఈ అమ్మడిని తెగ హైలేట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టాటూ తన బాడీ మీద వేయించుకుని అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది. తద్వారా వచ్చిన క్రేజ్‌తో అషురెడ్డి బిగ్‌బాస్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది.బిగ్‌బాస్ షోతో ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది.
.బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత సినిమాలతో పాటు,టీవీ షోల్లో కూడా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అషురెడ్డి చేసిన రచ్చ అంత ఇంత కాదు. రామ్ గోపాల్ వర్మతో అషురెడ్డి చేసిన ఇంటర్య్వూ అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఇక సోషల్ మీడియాలో అషురెడ్డి ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది.

తన షోస్‌కు సంబంధించిన విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అషురెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.తాజాగా అషురెడ్డి చేసిన పని ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెబుతూ ఈ హాట్ బ్యూటీ ఓ రీల్ చేసింది. ఇంట్లో పనిచేయాలంటూ, తాను అలిగినప్పుడు బదిమాలాడాలని చెప్పుకొచ్చింది.
అయితే ఈ రీల్ చేస్తున్న సమయంలో తన తల్లి ఎంట్రీ ఇచ్చి అషురెడ్డికి షాకిచ్చింది. కాబోయే భర్త ఇలాగే ఉండాలని అషురెడ్డి చెప్పిన మాటలు విన్న ఆమె తల్లి తనని చితకబాదింది. చీపురుతో అషురెడ్డిని రెండు దెబ్బలు వేసింది. తల్లి చీపురుతో తనని కొట్టినప్పటికీ ఈ వీడియోని అషురెడ్డి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications