బిగ్‌బాస్ బ్యూటీతో పవన్ కల్యాణ్ నిశ్చితార్థం..!
సెలబ్రిటీలు ఒకరి తరువాత మరొకరు పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇప్పటికే పలువురు హీరో, హీరోయిన్లు ప్రేమ వివాహం చేసుకొగా, మరి కొందరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. వెండితెరకు తాము ఏమాత్రం తీసిపోమని బుల్లితెర నటులు నిరుపించుకుంటున్నారు. హీరో, హీరోయిన్లతో సమానంగా సీరియల్ యాక్టర్స్ కూడా క్రేజ్ సంపాదించుకున్నారు.
సోషల్ మీడియాలో బుల్లితెర నటులదే హవా నడుస్తుంది. ఇటీవల బుల్లితెర నటులు కూడా వరుసగా ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ, సీరియల్ నటి వాసంతి పెళ్లి పీటలెక్కడానికి సిద్ధం అవుతుంది. ఆ వివారాల్లోకి వెళ్తే... నటి వాసంతి కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని సీరియల్స్ నటించింది. తద్వారా వచ్చిన గుర్తింపుతో బిగ్‌బాస్ 6వ సీజన్‌లో అడుగుపెట్టింది.

తొలుత షోలో వాసంతిపై ఎవరు పెద్దగా ఫోకస్ పెట్టలేదు. కాని ఆమె ఓ స్ట్రాంగ్ ప్లేయర్‌గా 10 వారాల పాటు హౌస్‌లో కొనసాగింది. వాసంతి అందాలకు కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు. బిగ్‌బాస్‌లో గ్లామర్ షోతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఈ షోతో వాసంతికి మంచి పాపులారిటీ దక్కింది. బిగ్‌బాస్ అనంతరం పలు షోల్లో సందడి చేసిన ఈ బ్యూటీ..వివాహం చేసుకోవాలని డిసైడ్ అయింది. ఈక్రమంలోనే తాను ప్రేమించిన వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది.

పవన్ కల్యాణ్ అనే వ్యక్తితో వాసంతి గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. ఇరు కుటుంబాలు అంగీకరించిన తరువాతే వీరి నిశ్చితార్థం జరిగినట్టు సమాచారం. పవన్ కల్యాణ్ కూడా నటుడే. ఆయన కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడని..అవి త్వరలోనే విడుదల కానున్నాయని తెలుస్తుంది. వాసంతి నిశ్చితార్థ కార్యక్రమానికి శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్, ఇనయ సుల్తానా, గీతూ రాయల్, ఆర్జే సూర్య వంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. త్వరలోనే పవన్ కళ్యాణ్-వాసంతి వివాహం జరగనుంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications