ఏంటీ ఆ బిగ్ బాస్ కంటెస్ట్ 'గే'నా..?

తెలుగు బిగ్ బాస్ 8వ సీజన్ దిగ్విజయంగా ఏడు వారాలను పూర్తి చేసుకుంది. ఈ ఏడు వారాల్లో బిగ్ బాస్ హౌస్‌లో ఎన్నో మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ఈసారి కంటెస్టెంట్లగా యష్మీ గౌడ ,నిఖిల్ అభియ్ నవీన్ , ప్రేరణ , ఆదిత్య ఓం , నైనికా ,సోనియా ఆకుల,బెజవాడ బేబక్క, ఆర్‌జే శేఖర్ భాషా , సీత, నాగ మణికంఠ,పృద్వీరాజ్, విష్ణు ప్రియ బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. అయితే ఈసారి సీజన్‌లో మణికంఠ బాగా పాపులర్ అయ్యాడు. పలు సీరియల్స్ ద్వారా వచ్చిన ఫేమస్‌తో బిగ్ బాస్ హౌ‌స్‌లోకి అడుగుపెట్టాడు. మొదటి రెండు వారాలు సైలెంట్‌‌గా ఉన్న మణికంఠ, తర్వాత హౌస్‌లో రెచ్చిపోయాడు.

హగ్‌లు కావాలంటూ తోటి సభ్యులను చాలా ఇబ్బంది పెట్టాడు. ఈ విషయంలో నాగార్జున సైతం మణికంఠను క్లాస్ పీకారు. ఇక హౌస్‌లో సింపతి కోసం తెగ ట్రై చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎలిమినేషన్ల నుంచి రెండు వారాలు తప్పించుకున్న మణికంఠ, చివరికి ఏడో వారంలో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. మణికంఠ తనంతట తానే బయటకు వచ్చేశాడు. తనకు ఇక్కడ ఉండటం అవడం లేదు, తాను ఫిజికల్‌గా, మెంటల్‌గా వీక్‌ అయిపోతున్నా అని తెలిపారు. తన హెల్త్, బ్రెయిన్‌ సపోర్ట్ చేయడం లేదని తెలిపారు. హార్ట్‌లో పెయిన్‌ స్టార్ట్ అవుతుందని, బ్రెయిన్‌ పనిచేయడం లేదు, బోన్స్ నొప్పిగా ఉన్నాయని, కూర్చుంటే నిలబడలేకపోతున్నా అని, పిచ్చి పిచ్చిగా ఉంటుందన్నారు. నిజంగానే ఈ ఆట అంటే ఇష్టమని, కానీ ఆడలేకపోతున్నా అని, తనని బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి పంపించమని నాగార్జునన వేడుకున్నాడు.

bigg boss contestant manikanta react on gay comments

దీంతో బిగ్ బాస్ నుంచి మణికంఠను ఎలిమినేట్ చేశారు నాగార్జున. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మణికంఠ పలు ఇంటర్య్వూల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌లో పాల్గొన్న మణికంఠకు ఊహించని ప్రశ్నను సంధించాడు యాంకర్. మీరు 'గే' అంటూ చాలామంది కామెంట్స్ చేశారని.. దీనిపై మీ స్పందన ఏంటి అని మణికంఠను యాంకర్ ప్రశ్నించాడు. దీనికి నాగ మణికంఠ స్పందిస్తూ.. "నాపై ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా నేను వాటిని పట్టించుకోను. నేను బిగ్ బాస్‌లోకి వెళ్ళకముందు ప్రతి చిన్న విషయానికి ఏడ్చే వాడిని. కానీ, ఇప్పుడు హౌస్ నుండి బయటకు వచ్చాక అలాంటి వాటిని పట్టించుకోవడం లేదు. ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోను" అంటూ నాగ మణికంఠ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+