కాపురంలో చిచ్చు పెట్టిన బిగ్‌బాస్..విడాకులు కోరిన కంటెస్టెంట్ భార్య

బిగ్‌బాస్ షో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్‌లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ..వారిలోని ఎమోషన్స్‌ను బయటకు తీసుకురావడమే ఈ షో యొక్క ముఖ్యం ఉద్దేశం. తొలుత హిందీలో మొదలైన ఈ రియాల్టీ షో తరువాత తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ప్రారంభం అయింది. ఈ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలుగా మారారు.

అదే విధంగా ఈ షో ద్వారా వివాదంలో చిక్కుకున్న వారి లిస్ట్ కూడా చాలానే ఉంది. ఇక బిగ్‌బాస్ షోకు వచ్చిన కంటెస్టెంట్‌లు ప్రేమలో పడినవారు కొందరైతే.. విడిపోయిన వారు మరికొందరు. తాజాగా బిగ్‌బాస్ 7వ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ విషయంలో జరిగిన రచ్చ గురించి అందరికి తెలిసిందే.కామన్ మ్యాన్‌గా బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చి.. ఎవరూ ఊహించని ఆటతీరుతో విజేతగా నిలిచాడు.

Bigg Boss Contestant wife asked for divorce

ఆ తరువాత జరిగిన అనుకోని సంఘటన వల్ల అతడు జైలుకు వెళ్లాల్సి వచ్చిన విషయం తెలిసిందే. షరతులతో కూడిన బెయిల్‌ దొరకడంతో శుక్రవారం పల్లవి ప్రశాంత్ జైలు నుంచి బయటకు వచ్చాడు. ఈ ఘటన మరువక ముందే మరో బిగ్‌బాస్ కంటెస్ట్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ షోకి వచ్చిన ఓ కంటెస్ట్ భార్య ఏకంగా విడాకులు ఇవ్వమని తన భర్తను కోరడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఆ వివారాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్ రసవత్తరంగా సాగుతుంది. ప్రస్తుత హిందీ బిగ్‌బాస్‌లో భార్యా,భర్తలైనా అంకిత లోఖండే, విక్కీ జైన్ కంటెస్ట్‌లుగా కొనసాగుతున్నారు. ఆ మధ్య బిగ్‌బాస్ నిర్వాహకులు అంకిత లోఖండేకు ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు కూడా నిర్వహించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన భర్తకు వెల్లడించింది.

Bigg Boss Contestant wife asked for divorce

ఇదిలా ఉంటే పెళ్లి తరువాత మగవాడి కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని విక్కీ జైన్ తొటి కంటెస్ట్‌కు చెప్పాడు. పక్కనే ఉన్న అతని భార్య అంకిత లోఖండే అంత కష్టంగా ఉండటం ఎందుకు విడాకులు ఇచ్చేయమని కోరింది. దీనిపై ఇరువురు కూడా సీరియస్‌గానే గొడవపడ్డారు. విక్కీ తనని ప్రేమిస్తాడని తెలుసు కానీ ప్రతి విషయంలో డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తాడని అంకిత చెప్పుకొచ్చింది.

Bigg Boss Contestant wife asked for divorce

బిగ్‌బాస్ హౌస్‌లో మేల్ కంటెస్టెంట్లతో మాట్లాడినా విక్కీ తట్టుకోలేడని,ఏదో తప్పు చేసినట్టుగా చూస్తాడని అంకిత తొటి కంటెస్టెంట్స్‌తో తన బాధను చెప్పుకుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బిగ్‌బాస్ షో ముగిసేలోపు అంకిత లోఖండే, విక్కీ జైన్ విడిపోవడం ఖాయమని కొందరు కామెంట్స్ చేస్తుంటే..వీరి కాపురంలో బిగ్‌బాస్ చిచ్చు పెట్టాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+