ప్రముఖ బిగ్‌బాస్ నటి అరెస్ట్.. ఎందుకంటే..?
కన్నడ బిగ్‌బాస్ ఓటీటీ కంటెస్టెంట్ సోను శ్రీనివాస్ గౌడను బెంగుళూరు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. 8 ఏళ్ల చిన్నారిని ఎలాంటి నియమాలు పాటించకుండా.. అక్రమంగా దత్తత తీసుకోవడమే ఆమె అరెస్ట్‌కు కారణమని తెలుస్తోంది. చిన్నారులను దత్తత తీసుకునే రూల్స్‌ను ఆమె బ్రేక్ చేసిందని పోలీసులు తెలిపారు. సోను శ్రీనివాస్ గౌడపై కొందరు ఫిర్యాదు చేయడంతో దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను దత్తత తీసుకోవడంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి.సోనూ శ్రీనివాస్ గౌడ అలాంటి నియమాలేవి పాటించకుండానే దత్తత తీసుకున్నారని తెలుస్తోంది.
దత్తత తీసుకునే వ్యక్తికి.. ఆ చిన్నారికి మధ్య కనీసం 25 ఏళ్ల వయసు వ్యత్సాసం ఉండాలి. కానీ సోను శ్రీనివాస్ గౌడకు.. ఆ అమ్మాయికి వయసు వ్యత్సాసం అంతగా లేదనే విషయం బయటపడింది. అలాగే దత్తత తీసుకున్న పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు. కానీ సోనూ అలాంటి నియమాలేవి పాటించలేదు. పైగా ఆ పాప తల్లిదండ్రులకు అనేక సౌకర్యాలు కల్పించి.. అక్రమంగా ఆ పాపను దత్తత తీసుకుందంటూ సోను శ్రీనివాస్ గౌడపై ఆరోపణలు వచ్చాయి.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సోను శ్రీనివాస్ గౌడను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై సోను శ్రీనివాస్ గౌడ మాట్లాడుతూ.. తనకు తెలిసినంత వరకు దత్తత నియమాలు పాటించానని అన్నారు. ఆ చిన్నారి తల్లిదండ్రులను సంప్రదించిన తర్వాతే దత్తత కార్యక్రమం జరిగిందని తెలిపింది. చట్టబద్ధంగా ఆ చిన్నారిని దత్తత తీసుకోవడానికి కనీసం 3 నెలల సమయం పడుతుంది. ఆమె పేరెంట్స్ అంగీకరించిన తరువాతే ఆ పాపను దత్తత తీసుకున్నానని ఆమె తెలిపింది. దీనిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని .. ఈ కేసులో తాను నిర్దోషిగా బయటపడతానని సోనూ తెలిపింది.












Click it and Unblock the Notifications