బిగ్‌బాస్ వల్ల జీవితం నాశనం అయింది..నా భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం
బిగ్‌బాస్ షో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ రియాల్టీ షో మన దేశ సంప్రదాయాలకు విరుద్ధమని పలువురు విమర్శలు చేసినప్పటికీ కూడా యాజమాన్యం ఇవేమి పట్టించుకోకుండా షోను నడిపిస్తున్నారు. తొలుత హిందీలో మొదలైన ఈ రియాల్టీ షో తరువాత తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ప్రారంభం అయింది.
కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్‌లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ..వారిలోని ఎమోషన్స్‌ను బయటకు తీసుకురావడమే ఈ షో యొక్క ముఖ్యం ఉద్దేశం. ఈ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలుగా మారారు. ఇక బిగ్‌బాస్ షోకు వచ్చిన కంటెస్టెంట్‌లు ప్రేమలో పడినవారు కొందరైతే.. విడిపోయిన వారు మరికొందరు.

తాజాగా బిగ్‌బాస్ షో వల్ల ఓ జంట విడాకులు తీసుకున్నారనే వార్త బయటకు వచ్చింది. బిగ్‌బాస్ షోకి వెళ్లి నా కాపురం కూల్చుకున్నా అంటూ ఓ నటి ఆవేదన వ్యక్తం చేసింది. మళయాళ బ్యూటీ ఆర్య కొన్ని సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తద్వారా పలు సినిమాల్లో అవకశాలు దక్కించుకుంది. ఇక బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఈ భామ తన క్రేజ్‌ను మరింత సంపాదించుకుంది.
అయితే ఈ బిగ్‌బాస్ వల్లే తన జీవితం నాశనం అయిందంటూ నటి ఆర్య ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త బిగ్‌బాస్ షోకు వెళ్లాలని తనపై ఒత్తిడి చేశారని.. ఫేం కోసం ఆయన ఇలా చేస్తున్నారని అనుకున్నానని..కాని అసలు విషయం తరువాత బయటపడిందని ఆర్య తెలిపింది. నేను బిగ్‌బాస్ షోకు వెళ్లి వచ్చే సరికి నా భర్త అడ్రస్ లేడని ఆమె చెప్పుకొచ్చింది.

అతని కోసం వెతికిన ఫలితం లేకుండా పోయింది. ఆ తరువాత ఒకరోజు నా సోదరి కాల్ చేసి నా భర్త వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని దుబాయ్‌లో ఉన్నాడని ఆమె చెప్పుకొచ్చింది. కోవిడ్ కారణంగా తాను అక్కడకి వెళ్లలేకపోయానని .. అలా నేను నా భర్తకు దూరం అయ్యానంటూ కన్నీరు పెట్టుకుంది.












Click it and Unblock the Notifications