Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bigg Boss Show:హౌజ్‌లో పాము కలకలం,కంటెస్టెంట్స్ పరిస్థితి చూస్తే..వీడియో వైరల్..!!

Bigg Boss OTT3:బుల్లి తెరపై బిగ్‌బాస్ ఎంతటి క్రేజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ముందుగా హిందీలో ప్రారంభమైన షో క్రమంగా అన్ని భాషల్లో టెలికాస్ట్ అవుతోంది. అంతేకాదు మంచి వ్యూయర్‌షిప్‌తో లేదా రేటింగ్‌తో ఈ రియాల్టీ షో దూసుకెళుతోంది. కంటెస్టెంట్స్ కూడా తమదైన శైలిలో ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నారు అదే సమయంలో ఎంటర్‌టెయిన్ చేస్తున్నారు. ఇక బిగ్‌ బాస్ హౌజ్‌లోకి అప్పుడప్పుడు స్పెషల్ గెస్ట్‌లు ఎంట్రీ ఇస్తుంటారు. ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ రియాల్టీ షో ఓటీటీ వేదికగా టెలికాస్ట్ అవుతోంది. ఈ షోకు కూడా స్పెషల్ గెస్ట్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ గెస్ట్ చాలా ప్రమాదకరం. ఇంతకీ ఆ గెస్ట్ ఎవరు తెలుసుకోవాలంటేఈ స్టోరీ చదవాల్సిందే.

బిగ్‌బాస్ రియాల్టీ షో ఒక హైప్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓటీటీ వేదికగా హిందీలో బిగ్‌బాస్ షో నడుస్తోంది. అయితే బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ రోజువారీగానే వారికి అప్పగించిన టాస్క్‌లో నిమగ్నమై ఉన్నారు. కరెక్ట్‌గా అదే సమయంలో ఓ పాము బిగ్‌బాస్ హజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి కలకలం సృష్టించింది. గార్డెన్ ఏరియాలో సంచరిస్తున్న పామును కంటెస్టెంట్స్ ఎవరు గమనించలేదు. ఎవరి పనిలో వారున్నారు. ఇది లైవ్ టెలికాస్ట్ కావడంతో చూస్తున్న ప్రేక్షకులు ఆ పామును గమనించారు. వెంటనే స్క్రీన్ రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో బిగ్‌ బాస్ షో కంటెస్టెంట్స్ సేఫ్టీ ప్రశ్నార్థకంగా మారింది.

Bigg Boss OTT 3 House Encounters Snake Viral Video Stuns Fans

వీడియోను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కంటెస్టెంట్ లవ్‌కేష్ కటారియా చేతులు కట్టేసి ఉన్నాయి. తను గార్డెన్ ఏరియాలో కూర్చుని ఉన్నాడు.అయితే తనకు సమీపంలోనే ఒక పాము సంచరిస్తోందన్న విషయాన్ని గమనించలేదు.మిగతా కంటెస్టెంట్స్ పరిస్థితి కూడా అలానే ఉంది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతి ఒక్కరూ బిగ్‌బాస్ హౌజ్ సేఫ్టీని ప్రశ్నిస్తున్నారు. అయితే వీడియో వైరల్ అయిన కాసేపటికే జియో సినిమా టీమ్ ఈ క్లిప్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ వీడియో నిజమైన వీడియో కాదని ఎవరో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారని వాస్తవానికి అక్కడ ఎలాంటి పాము లేదని స్పష్టం చేసింది.

అయితే జియో ఇచ్చిన క్లారిటీపై కూడా నెటిజెన్లు కౌంటర్ ఇచ్చారు. అది లైవ్ ఫీడ్‌ను రికార్డు చేశారని దాన్ని ఎడిట్ ఎలా చేస్తామని ప్రశ్నించారు.కంటెస్టెంట్స్ ప్రాణాలకంటే ఎంటర్‌టెయిన్మెంట్ ముఖ్యమా అని ప్రశ్నించారు. నిజంగానే ఎవరికైనా ప్రాణహాని జరిగి ఉంటే బాధ్యత ఎవరు తీసుకుంటారని నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది గమనించిన నిర్వాహకులు కంటెస్టెంట్లను వెంటనే లోపలికి వెళ్లాల్సిందిగా పలుమార్లు ప్రకటన చేశారు. అన్ని ద్వారాలు మూసేశారు. ఇది గమనించిన ప్రేక్షకులు ఇక నిర్వాహకులు పామును పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కామెంట్స్ పెట్టారు.

జియోసినిమా వేదికగా ఈ బిగ్‌బాస్ షో టెలికాస్ట్ అవుతోంది. హౌజ్‌లో 12 మంది కంటెస్టెంట్‌లు ఉన్నారు.తాజాగా మునీషా బిగ్‌బాస్ ఓటీటీ 3 షో నుంచి ఎలిమినేట్ అయ్యింది.ఇక బిగ్‌బాస్ హౌజ్‌లో సెక్యూరిటీ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. భద్రతాపరమైన లోపాలు ఉన్నందున జియో సినిమా యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పాలని కంటెస్టెంట్ల భద్రతపై దృష్టి సారించాలని చాలామంది నెటిజెన్లు కోరుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+