Bigg Boss 7 Telugu : అతని విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న బిగ్‌బాస్.. షో మధ్యలోనే ఎలిమినేట్..?
బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్ అంచనాలకు తగినట్టుగానే అందరిని ఆకట్టుకుంటుంది. గత మూడు సీజన్లు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో... తాజాగా సీజన్‌పై తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. తాజా సీజన్లో పెద్దగా పేరున్న సెలబ్రిటీలను తీసుకురానపన్పటికీ.. ఈసారి ఉల్టా,ఫల్టా అంటూ బిగ్‌బాస్ ఆడించే గేమ్ సరికొత్తగా ఉండటంతో.. 7వ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మూడు వారాలను పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్ నాల్గో వారంలోకి అడుగుపెట్టింది.
మొదటి వారంలో షకీలా హౌస్ నుంచి బయటకు రాగా, రెండో వారంలో కిరణ్ రాథోడ్, మూడో వారంలో సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యారు. అయితే నాల్గో వారం ముగియకముందే ఓ కంటెస్ట్ షో నుంచి బయటకు వచ్చారని సమాచారం అందుతుంది. రైతు బిడ్డగా అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ షో మధ్యలోనే బయటకు వచ్చేశారని తెలుస్తోంది. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా ఏటీఎం నుంచి కాయిన్స్ ఎవరు ఎక్కువుగా కలెక్ట్ చేస్తే వారే పవర్ అస్త్ర పొందడానికి అర్హులు అని చెప్పడంతో కంటెస్టెంట్లు పోటాపోటీగా కాయిన్స్ కలెక్ట్ చేయడానికి పరుగులు తీశారు.

గేమ్ ఆడే సమయంలో పల్లవి ప్రశాంత్ తలకు గాయం అయింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో పల్లవి ప్రశాంత్‌ను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు పంపించాలని షో యాజమాన్యం నిర్ణయించిందట. డాక్టర్లు సూచన మేరకే పల్లవి ప్రశాంత్‌ను షో నుంచి మధ్యలోనే పంపిస్తున్నారని వినికిడి. అయితే గాయం తగ్గిన తరువాత పల్లవి ప్రశాంత్‌ను తిరిగి హౌస్‌లోకి తీసుకువస్తారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. రైతు బిడ్డగా ఫేమస్ అయిన పల్లవి ప్రశాంత్ .. టైటిల్ గెలవడమే లక్ష్యంగా బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. ఇంతలోనే పల్లవి ప్రశాంత్‌కు గాయం అయి షో నుంచి మధ్యలోనే బయటకు వచ్చేశాడు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురువుతున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ షో నుంచి వచ్చేశారనే విషయంలో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications