Bigg Boss Telugu 8 : తొలిరోజే కంటెస్టెంట్ల మధ్య కొట్లాట..!
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ 8వ సీజన్ ఘనంగా ప్రారంభం అయింది. ఎవరి అంచనాలకు అందని విధంగా కొత్త సీజన్ మొదలైంది. గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ ఉండబోతుందని ప్రోమోలను చూస్తేనే అర్థం అయింది. దానికి తగ్గట్టుగానే మొదటి రోజే ట్విస్ట్‌లతో బిగ్‌బాస్ అదరగొట్టారు. కంటెస్టెంట్లను సింగిల్‌గా కాకుండా జంటలుగా పంపించి కొత్తదనానికి బిగ్‌బాస్ నాంది పలికింది. అలాగే బిగ్‌బాస్ 8వ సీజన్ మొత్తం కెప్టెన్ లేకుండానే షో కొనసాగుతుందని చెప్పి బిగ్‌బాస్ పెద్ద షాకిచ్చాడు. మరోవైపు ఎవరూ ఊహించని విధంగా తొలిరోజే బిగ్‌బాస్‌లో ఫైటింగ్ మొదలైనట్టు తెలుస్తోంది.
తాజాగా చూపించిన ప్రోమోలో నిఖిల్ ,నాగ మణికంఠల మధ్య ఏదో గొడవ జరిగినట్టు చూపించారు. నాగ మణికంఠ మాట్లాడుతూ నీ వల్ల ఇష్యూ పెద్దది అవుతుందని చెబుతుండగా, నా వల్ల అయితే వదిలేయ్ అంటూ నిఖిల్ చెప్పడం ప్రోమోలో చూపించారు.ప్రోమో చూస్తుంటే ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్టే కనిపిస్తోంది. దీంతో తొలిరోజు నుంచే బిగ్‌బాస్ తన గేమ్ మొదలుపెట్టారనే అభిప్రాయం వ్పయక్డుతం అవుతోంది. ఇక ఎప్పటి మాదిరిగానే టీవీ సీరియల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు కంటెస్టెంట్లను చూస్తే అర్థం అవుతోంది.

ఈ సీజన్ మొదటి కంటెస్టెంట్‌గా సీరియల్ యాక్టర్ యష్మీ గౌడ ఎంట్రీ ఇచ్చారు. సీరియల్ యాక్టర్స్ నిఖిల్ రెండో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. మూడో కంటెస్టెంట్‌గా కమెడియన్ అభియ్ నవీన్ , నాలుగో కంటెస్టెంట్‌గా సీరియల్ యాక్టర్ ప్రేరణ బిగ్‌బాస్‌లో అడుగుపెట్టారు. ఐదో కంటెస్టెంట్‌గా ''లాహిరి లాహిరి లాహిరీలో'' సినిమా హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చారు. ఆరో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు యాక్టర్ సోనియా ఆకుల. ఆమెకు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మద్దతు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను సైతం బిగ్‌బాస్‌లో ప్లే చేశారు. ఏడో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టారు ప్రముఖ యూట్యూబర్, యాక్టర్ బెజవాడ బేబక్క.
ఎనిమిదో కంటెస్టెంట్‌గా ఆర్‌జే శేఖర్ భాషా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టారు.తొమ్మిదో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చింది 7ఆర్ట్స్ సీత. పదో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు సీరియల్ యాక్టర్ నాగ మణికంఠ. పదకొండో కంటెస్టెంట్‌గా పృద్వీరాజ్ ,పన్నెండో కంటెస్టెంట్‌గా ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ అడుగుపెట్టారు. 13వ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన డాన్సర్ నైనిక ఎంట్రీ ఇచ్చింది.14వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్ నబీల్ అఫ్రిది హౌస్‌లో అడుగుపెట్టారు. తాజాగా విడుదలైన ప్రోమోతో షోపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.












Click it and Unblock the Notifications