బిగ్ బాస్ నుంచి ఆ బ్యూటీ అవుట్

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ 8వ సీజన్ ఘనంగా తన ఆరు వారాలను పూర్తి చేసుకుంది. ఈసారి ప్రోమోలతోనే హైప్ పెంచిన బిగ్‌బాస్ దానికి అనుగుణంగానే కంటెంట్‌తో ఆకట్టుకుంటుంది.అయితే ఈ సీజన్‌లో పెద్దగా పేరున్న ఆర్టిస్టులు లేకపోవడంతో షో యామమాన్యంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు.మరోవైపు కంటెస్టెంట్లు సైతం ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకున్నట్టు కనిపించలేదు. హౌస్ మేట్స్ తమ స్ట్రాటజీలతో గేమ్‌ను స్టార్ట్ చేశారు. కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలయ్యాయి.అయితే ఈ గొడవలు చూడటానికి కొంచెం అతిగా అనిపించాయి.

వంట దగ్గర నుంచి హౌస్ శుభ్రంగా ఉంచుకోవడం, బాత్ రూమ్స్ నీట్‌గా లేకపోవడం అంశాలపై హౌస్‌మెట్స్ మధ్య గొడవలు జరిగాయి. ఇక తొలివారం ఎలిమినేషన్‌లో భాగంగా బెజవాడ బేబక్క హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. రెండో వారంలో శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యారు. మూడోవారం హౌస్ నుంచి అభినవ్ బయటకు వచ్చేశారు. అయితే నాలుగోవారం ఆకుల సోనియా హౌస్ నుంచి ఎలిమినేషన్ అవ్వగా, ఐదో వారం నైనికా బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఐదో వారమే బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు.మెహబూబ్, హరితేజ, నాయని పావని, ముక్కు అవినాష్, గౌతమ్ కృష్ణ, రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ వంటి పాత కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లో అడుగుపెట్టారు.

Bigg Boss Telugu 8 kirrak seetha will be 6th week elimination

ఇక వారం నామినేషన్ లిస్ట్‌ను ఓసారి పరిశీలిస్తే..విష్ణు ప్రియ, పృథ్వీ, యష్మీ, గంగవ్వ, సీత,మెహబూబ్ మొత్తం ఆరుగురు నామినేషన్‌లో నిలిచారు. అయితే ఆరో వారం ఎవరూ ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆరో వారం హౌస్ నుంచి బయటకు రావడానికి కంటెస్టెంట్ల మధ్య పెద్ద యుద్దమే నడించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కిర్రాక్ సీత హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. మొదటి నాలుగు వారాలు గేమ్ బాగా ఆడిన సీత, సడన్‌గా చివరి రెండు వారాల్లో కాస్తా స్లో అయినట్టు కనిపించింది. దీని కారణంగానే ఆమెకు ఓట్లు తక్కువ స్ధాయిలో పోల్ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఈ వారం కిర్రాక్ సీత హౌస్ నుంచి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+