Bigg Boss Telugu 8 Live Updates : తొలిరోజే కంటెస్టెంట్ల మధ్య డైలాగ్ వార్

తెలుగులో దిగ్విజయంగా ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్, మరో సీజన్‌కు రెడీ అయింది. దీనిలో భాగంగానే ఈ ఆదివారం నుంచి బిగ్‌బాస్ కొత్త సీజన్ ప్రారంభం అయింది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు షోపై అంచనాలు మరింత పెంచేశాయి. తాజాగా విడుదల చేసిన ప్రోమోతో బిగ్‌ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. సీజన్ ఆరంభం రోజునే ఎలిమినేషన్ ఉందని చెప్పడం సంచలనంగా మారింది.తాజాగా చూపించిన ప్రోమోలో నిఖిల్ ,నాగ మణికంఠల మధ్య ఏదో గొడవ జరిగినట్టు చూపించారు. నాగ మణికంఠ మాట్లాడుతూ నీ వల్ల ఇష్యూ పెద్దది అవుతుందని చెబుతుండగా, నా వల్ల అయితే వదిలేయ్ అంటూ నిఖిల్ చెప్పడం ప్రోమోలో చూపించారు.ప్రోమో చూస్తుంటే ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్టే కనిపిస్తోంది. దీంతో తొలిరోజు నుంచే బిగ్‌బాస్ తన గేమ్ షూరు మొదలుపెట్టారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Bigg Boss Telugu 8 Live Updates

Sep 01, 2024, 9:56 pm IST

14వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయ‌న్స‌ర్ నబీల్ అఫ్రిది
Sep 01, 2024, 9:42 pm IST

13వ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన డాన్సర్ నైనిక.
Sep 01, 2024, 9:34 pm IST

పదకొండో కంటెస్టెంట్‌గా పృద్వీరాజ్ ,పన్నెండో కంటెస్టెంట్‌గా ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ హౌస్‌లో అడుగుపెట్టారు.
Sep 01, 2024, 9:29 pm IST

పన్నెండో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ
Sep 01, 2024, 9:29 pm IST

పదకొండో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన పృద్వీరాజ్
Sep 01, 2024, 9:07 pm IST

నానితో కలిసి బిగ్‌బాస్‌ స్టేజీ మీద హీరోయిన్ ప్రియాంకా మోహన్ ఎంట్రీ
Sep 01, 2024, 8:59 pm IST

బిగ్‌బాస్‌లోకి హీరో నాని ఎంట్రీ
Sep 01, 2024, 8:56 pm IST

కిర్రాక్ సీతకు బడ్డీగా సీరియల్ యాక్టర్ నాగ మణికంఠ
Sep 01, 2024, 8:55 pm IST

పదో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన సీరియల్ యాక్టర్ నాగ మణికంఠ
Sep 01, 2024, 8:47 pm IST

తొమ్మిదో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చిన 7ఆర్ట్స్ సీత
Sep 01, 2024, 8:35 pm IST

బెజవాడ బేబక్కకు బడ్డీగా ఆర్‌జే శేఖర్ భాషా
Sep 01, 2024, 8:31 pm IST

ఎనిమిదో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఆర్‌జే శేఖర్ భాషా
Sep 01, 2024, 8:25 pm IST

ఏడో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ప్రముఖ యూట్యూబర్, యాక్టర్ బెజవాడ బేబక్క
Sep 01, 2024, 8:23 pm IST

సోనియా ఆకుల కు మద్దతు తెలిపిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
Sep 01, 2024, 8:22 pm IST

హీరో ఆదిత్య ఓం కు బడ్డీగా యాక్టర్ సోనియా సెలెక్ట్ అయ్యారు.
Sep 01, 2024, 8:19 pm IST

ఆరో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన యాక్టర్ సోనియా
Sep 01, 2024, 8:14 pm IST

ఐదో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ''లాహిరి లాహిరి లాహిరీలో'' సినిమాలో హీరో ఆదిత్య ఓం
Sep 01, 2024, 8:11 pm IST

బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున. ఈ సీజన్‌లో కెప్టెన్ లేరని తేల్చేసిన బిగ్ బాస్
Sep 01, 2024, 8:01 pm IST

హౌజ్‌లోకి ఎంటర్ అయిన రానా, నివేదితా థామస్. కంటెస్టెంట్లకు బాటిల్ ఫ్లిప్ టాస్క్ ఇచ్చిన రానా అండ్ నివేదిత
Sep 01, 2024, 7:54 pm IST

నివేదితా థామస్, ప్రియదర్శి ప్రధాన పాత్రలుగా వస్తోన్న 35. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో స్టోరీ ఉండబోతోందంటూ రివీల్ చేసిన నివేదిత థామస్
Sep 01, 2024, 7:52 pm IST

35 చిత్రం తన మనసుకు చాలా దగ్గరగా ఉన్న మూవీ అని చెప్పిన రానా. తను 10వ తరగతి మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినట్లు చెప్పిన రానా
Sep 01, 2024, 7:51 pm IST

బిగ్‌బాస్ స్టేజ్‌పై 35 చిత్రం యూనిట్. రానా దగ్గుబాటి సమర్పణలో వస్తున్న చిత్రం
Sep 01, 2024, 7:44 pm IST

ప్రేరణ తన భర్తను ఎంతగా ఇష్టపడుతుందో చిన్న టెస్టు పెట్టిన నాగార్జున
Sep 01, 2024, 7:43 pm IST

హీరోయిన్ రష్మికా మందన్నా ప్రేరణ రూమ్ మేట్స్
Sep 01, 2024, 7:41 pm IST

రెండవ కంటెస్టెంట్‌గా పెళ్లిచూపుల ఫేమ్ అభయ్ నవీన్ ఎంట్రీ. ఇతనికి బడ్డీగా ప్రేరణ సెలెక్ట్ అయ్యారు.
Sep 01, 2024, 7:39 pm IST

కంటెస్టెంట్లను జంటగా హౌజ్‌లోకి పంపడమే ఈసారి సీజన్ 8 ప్రత్యేకత
Sep 01, 2024, 7:38 pm IST

తొలి కంటెస్టెంట్‌గా యష్మీ ఎంట్రీ. అయితే హౌజ్‌లోకి ఎంట్రీ సింగిల్‌గా లేనందున ఆమె బడ్డీగా నిఖిల్ ఎంపికయ్యాడు
Sep 01, 2024, 7:36 pm IST

హౌజ్‌లోకి కంటెస్టెంట్ల ఎంట్రీ చాలా వెరైటీగా జరిగింది.
Sep 01, 2024, 7:02 pm IST

ఎన్టీఆర్ దేవర పాటతో ఎంట్రీ ఇచ్చిన కింగ్ నాగార్జున
ఎన్టీఆర్ దేవర పాటతో ఎంట్రీ ఇచ్చిన కింగ్ నాగార్జున

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+